వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

Published : Jul 26, 2020, 05:23 PM ISTUpdated : Jul 26, 2020, 10:46 PM IST
వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

సారాంశం

ఓ స్థల వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదంలో చిక్కుకొన్నారు. ఎమ్మెల్యే నాగేందర్ తమను బెదిరించారని బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. 


హైదరాబాద్: ఓ స్థల వివాదంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదంలో చిక్కుకొన్నారు. ఎమ్మెల్యే నాగేందర్ తమను బెదిరించారని బ్యాంకు అధికారులు పోలీసులను ఆశ్రయించారు. 

హైద్రాబాద్‌లోని ఓ ఖాళీ స్థలాన్ని 2010లో కావూరి సాంబశివరావు అనే వ్యక్తి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో లోన్ తీసుకొన్నాడు. అయితే ఈ లోన్ ను ఆయన చెల్లించలేదు. దీంతో ఈ లోన్ చెల్లించనందుకు గాను ఈ స్థలాన్ని విక్రయించాలని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నిర్ణయం తీసుకొంది.

ఈ స్థలాన్ని బహిరంగ వేలం వేశారు. వేరే వ్యక్తికి ఈ భూమిని ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు సిద్దమయ్యారు. అయితే ఇదే సమయంలో ఖైరతాబాద్  ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడికి చేరుకొన్నాడు.

ఎలాంటి ప్రకటనలు ఇవ్వకుండానే ఎలాఈ భూమిని ఎలా వేలం వేస్తారని ఎమ్మెల్యే బ్యాంకు అధికారులను నిలదీశారు. వేలం ప్రక్రియను అడ్డు తగిలారని బ్యాంకు అధికారులు ఆరోపిస్తున్నారు. 

ఈ విషయమై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు,. బ్యాంకు అధికారులతో ఎమ్మెల్యే  దానం నాగేందర్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.