వరంగల్ : ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు... వివాహిత సూసైడ్

Published : Jul 26, 2023, 04:38 PM IST
వరంగల్ : ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు...  వివాహిత సూసైడ్

సారాంశం

ఇంటి ఓనర్ లైంగిక వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వరంగల్ : తన ఇంట్లో అద్దెకుండే వివాహితపై ఇంటి ఓనర్ కన్నేసాడు. భర్త లేని సమయంలో వివాహిత వద్దకు వెళ్లి మాయమాటలతో ఆమెను లోబర్చుకోవాలని చూసాడు. ఇది కుదరకపోవడంతో బలవంతంగా అయినా వివాహితను అనుభవించాలని నీచంగా ప్రవర్తించసాగాడు. ఈ లైంగిక వేధింపులు భరించలేకపోయిన వివాహిత చివరకు ఆత్మహత్య చేసుకుంది. ఈ దారుణం వరంగల్ గ్రామీణ జిల్లాలో చోటుచేసుకుంది. 

మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన పస్తం శ్రీను,మంజుల భార్యాభర్తలు. 2006 లో వీరికి పెళ్లవగా పదేళ్లు ముంబైలో వున్నారు. ఇటీవలే స్వస్థలానికి తిరిగివచ్చిన దంపతులు జాటోత్ జితేందర్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకుంటున్నారు. అయితే మంజులపై ఇంటి ఓనర్ జితేందర్ కన్నేసి లొంగదీసుకోడానికి ప్రయత్నించాడు. ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పోలీస్ స్టేషన్ లో కౌన్సెలింగ్, పెద్ద మనుషుల పంచాయితీని కూడా ఎదుర్కొన్నాడు. అయినప్పటికి జితేందర్ తీరులో ఏమాత్రం మార్పులేదు. అతడి లైంగిక వేధింపులు భరించలేకపోయిన ఆమె పదిహేను రోజులుగా సోదరి ఇంట్లో వుంటోంది. 

మంజుల సోదరి ఇంట్లో వుందని తెలుసుకున్న జితేందర్ అక్కడికీ వెళ్లాడు. ఆమెకు మాయమాటలు చెప్పి వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని ఓ ఇంటికి తీసుకెళ్లాడు. ఆమె వద్దంటున్న వినకుండా జితేందర్ బలవంతంగా లైంగికదాడికి యత్నించాడు. దీంతో మంజుల తీవ్ర మనస్తాపానికి గురయి ఎలుకల మందు తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రాణాపాయ స్థితిలో వరంగల్ ఎంజిఎంలో చికిత్స పొందుతూ మంజుల ప్రాణాలు విడిచింది. 

Read More   చైల్డ్ పోర్న్ వీడియోలు షేర్.. హైదరాబాద్ లో ఎంసిఏ స్టూడెంట్ అరెస్ట్..

మృతురాలి భర్త శ్రీను ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తన భార్య ఆత్మహత్యకు జితేందర్  లైంగిక వేధింపులే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పరారీలో వున్న జితేందర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలంగాణలో వర్షాలు ... ఎప్పట్నుంచో తెలుసా?
KCR Press Meet from Telangana Bhavan: చంద్రబాబు పై కేసీఆర్ సెటైర్లు | Asianet News Telugu