కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి...బంజారాహిల్స్ లో రూ.20కోట్ల ఇంటిస్థలం

By Arun Kumar PFirst Published Jul 22, 2020, 12:29 PM IST
Highlights

భారత్-చైనా సరిహద్దులో ఇటీవల వీరమరణం పొందిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఇంటి స్థలం హామీని నెరవేర్చే దిశగా అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. 
 

హైదరాబాద్: భారత్-చైనా సరిహద్దులో ఇటీవల వీరమరణం పొందిన తెలంగాణ వాసి కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు హామీలిచ్చారు. అందులో భాగంగా అప్పటికప్పుడే సంతోష్ బాబు కుటుంబానికి నగదు సాయం అందించారు. తాజా ఆ కుటుంబానికి హైదరాబాద్ లో ఇస్తామన్న ఇంటి స్థలం హామీని నెరవేర్చే దిశగా అధికారులు వేగంగా పనులు చేస్తున్నారు. 

బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్కుకు ఎదురుగా రూ.20 కోట్ల విలువైన 711 గజాల స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి కేటాయించింది. కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళే(బుధవారం) ఆ స్థలానికి సంబంధించిన పత్రాలను మంత్రి జగదీశ్ రెడ్డి వీరజవాన్ కుటుంబానికి అందించనున్నారు. 

read  more  

షేక్ పేట్ మండలంలో మూడు ప్రభుత్వ స్థలాల్లో ఇష్టం వచ్చిన దాన్ని ఎంచుకునే అవకాశాన్ని ప్రభుత్వం సంతోష్ బాబు కుటుంబానికి కల్పించింది. వారి కోరిక మేరకు బంజారాహిల్స్ లో స్థలం కేటాయించారు. ఈ స్థలాన్న తాజాగా జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి పరిశీలించారు. 

ఇలా కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మూడు హామీల్లో ఆర్థిక సాయం, ఇంటి స్థలం పూర్తవనున్నాయి. ఇక కల్నల్ భార్యకు ప్రభుత్వ ఉద్యోగంలో చేరడమే మిగిలిపోయింది. 

 
 

click me!