హైదరాబాద్‌లో మరో పరువుహత్య : యువకుడిని 20 సార్లు పొడిచి చంపిన అమ్మాయి బంధువులు

Siva Kodati |  
Published : May 20, 2022, 09:02 PM ISTUpdated : May 20, 2022, 09:30 PM IST
హైదరాబాద్‌లో మరో పరువుహత్య : యువకుడిని 20 సార్లు పొడిచి చంపిన అమ్మాయి బంధువులు

సారాంశం

తెలంగాణలో వరుస పరువు హత్యలు కలకలం రేపాయి. కొద్దిరోజుల క్రితం సరూర్‌నగర్‌లో నాగరాజు హత్య ఘటనను మరిచిపోకముందే బేగంబజార్‌లో నీరజ్ పన్వార్‌గా గుర్తించారు. 

హైదరాబాద్ (hyderabad) బేగంబజార్‌‌లో (begum bazar) దారుణహత్య జరిగింది. స్థానిక షాహీనాథ్‌గంజ్‌లో యువకుడిని కత్తితో పొడిచి చంపారు దుండగులు. ప్రేమ పెళ్లి చేసుకున్నాడన్న కక్షతో ఈ హత్య జరిగినట్లుగా తెలుస్తోంది. మృతుడిని నీరజ్ పన్వార్‌గా గుర్తించారు. ఏడాది క్రితం నీరజ్ పన్వార్ ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. యువతి బంధువులే దాడి చేసినట్లుగా అనుమానిస్తున్నారు. కత్తితో దాదాపు 20 సార్లు పొడిచినట్లుగా స్థానికులు చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఐదుగురు వ్యక్తులు ఆ దారుణానికి పాల్పడ్డారు. రెండు బైకుల మీద వెంబడించి యువకులు నీరజ్ పన్వార్ ను దారుణంగా హత్య చేశారు. నీరజ్ పన్వార్ ఏడాదిన్నర క్రితం హైదరాబాదులోని అఫ్జల్ గంజ్ కు చెందిన యువతిని అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. నీరజ్ పన్వార్ భార్య సోదురడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మాటు వేసి బైకుల మీద వెంబడించి అతన్ని దుండగులు హత్య చేశారు.

ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 


 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu