హోంగార్డు రవీందర్ మృతికి కారకులను శిక్షించాలి: తెలంగాణ హైకోర్టులో పిటిషన్

By narsimha lode  |  First Published Sep 8, 2023, 3:54 PM IST

హోంగార్డు రవీందర్ మృతికి కారణమైన అధికారులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్ తో  హోంగార్డు జేఏసీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.


హైదరాబాద్: హోంగార్డు రవీందర్ మృతికి కారణమైన అధికారులను కఠినంగా శిక్షించాలని కోరుతూ  హోంగార్డు జేఏసీ  ఆధ్వరంలో శుక్రవారంనాడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది.  హోంగార్డు జేఏసీ నేతలను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారని కూడ ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. 

నాలుగు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నం చేసిన హోంగార్డు రవీందర్ డీఆర్‌డీఓ కంచన్ బాగ్ ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.  రవీందర్ మృతదేహన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అయితే  రవీందర్ ఆత్మహత్య  చేసుకోలేదని ఆయన భార్య సంధ్య ఆరోపిస్తున్నారు. తన భర్త రవీందర్ పై కానిస్టేబుల్ చంద్,  ఎఎస్ఐ నర్సింగరావు  పెట్రోల్ పోసి నిప్పంటించారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై  తనకు  న్యాయం చేయాలని ఆమె కోరుతున్నారు.ఈ ఇద్దరిపై  చర్యలు తీసుకున్న తర్వాతే  రవీందర్ మృతదేహనికి పోస్టు మార్టం కోసం తాను సంతకం చేస్తానని  సంధ్య తేల్చి చెప్పారు. సంధ్యతో  పోలీస్ ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. ఇదిలా ఉంటే  సంధ్యకు కాంగ్రెస్, సీపీఐలు మద్దతు ప్రకటించాయి.

Latest Videos

undefined

హోంగార్డు రవీందర్ మృతికి కారణాలపై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  అయితే  రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడా.. ఎవరైనా ఆయనపై పెట్రోల్ పోసి నిప్పంటించారా అనే విషయమై  పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.  ఈ విషయమై  షాహినాయత్ పోలీస్ స్టేషన్ లో  పోలీసులు కేసు నమోదు చేశారు. కానిస్టేబుల్ చంద్,  ఎఎస్ఐ  నర్సింగరావుపై  పోలీసులు కేసు  నమోదు చేశారు.  

also read:హోంగార్డు రవీందర్ కుటుంబానికి విపక్షాల సంఘీభావం: సంధ్యతో పోలీసు ఉన్నతాధికారుల చర్చలు

హోంగార్డు రవీందర్ ను  పిలిపించి  హత్య చేశారని  ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రవీందర్ కుటుంబ సభ్యులు  చేస్తున్న ఆరోపణలు నిజమా కాదా అనే విషయాన్ని  పోలీసులు తమ విచారణలో తేల్చనున్నారు.
 

click me!