రంగునీళ్లు అనుకొని బావ మీద యాసిడ్ చల్లిన మరదలు

Published : Mar 17, 2017, 09:36 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
రంగునీళ్లు అనుకొని బావ మీద యాసిడ్ చల్లిన మరదలు

సారాంశం

హోలీ పండగ వేళ నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం  

బావ ను ఆటపట్టించాలనుకున్న ఓ మరదలు సరసం చివరికే అతని ప్రాణాన్నే తీసింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని దేవుడితండా లో ఈ ఘటన చోటు చేసుకుంది.

 

హైదరాబాద్ లోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మూడో సంవత్సరం చదువుతున్న చందునాయక్ హోలీ పండగ నేపథ్యంలో సొంతూరికి వెళ్లాడు.

 

ఇంటి వద్ద ఉండగా మరదలు వరసయ్యే యువతి అతడిపై రంగునీళ్లు అనుకొని టార్పెంటాయిల్ చల్లింది.

 

అయితే ఆ సమయంలో చందు కట్టలపొయ్యే పక్కనే ఉండటంతో టార్పెంటాయిల్  అతడిపై నే కాకుండా పొయ్యిలో కూడా పడి భారీగా మంటలు  చెలరేగాయి.

 

ఈ మంటలు చందును కూడా అంటుకున్నాయి. దీంతో అతడు సమీపంలో ఉన్న నీటి డ్రమ్ములో దూకాడు. బంధువులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించాడు.

 

డాక్టర్లు చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్న చందు గురువారం మృతి చెందాడు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!