హైదరాబాదీలకు హెచ్ఎండీఏ శుభవార్త .. ఓఆర్‌ఆర్‌పై స్పీడ్ లిమిట్ పెంపు, గంటకు ఎంతంటే..?

By Siva Kodati  |  First Published Jun 27, 2023, 7:06 PM IST

ఓఆర్ఆర్‌పై స్పీడ్ లిమిట్‌ను పెంచుతూ హెచ్ఎండీఏ శుభవార్త చెప్పింది. ఔటర్‌పై వాహనాల వేగం గంటలకు 100 కి.మీ నుంచి 120కి పెంచుతున్నట్లు తెలిపింది. 


ఓఆర్ఆర్‌పై ప్రయాణించే వారికి హెచ్ఎండీఏ శుభవార్త చెప్పింది. ఔటర్‌పై వాహనాల వేగ పరిమితిని పెంచుతున్నట్లు హెచ్ఎండీఏ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం ఓఆర్ఆర్‌పై వాహనాలు గంటకు 100 కిలోమీటర్లు మాత్రమే వేగంగా వెళ్లాలి. అయితే దానిని ఇక నుంచి గంటకు 120 కిలోమీటర్ల వరకు అనుమతించనున్నారు. ఈ మేరకు తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జరిపిన సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అలాగే అన్ని సేఫ్టీ ప్రోటోకాల్‌లు అమలులో వుండేలా హెచ్ఎండీఏను మంత్రి ఆదేశించారు.

ఇదిలావుండగా.. ఔటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. ఈ టెండర్‌లో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అవినీతికి పాల్పడిందని.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఓఆర్ఆర్ వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.415 కోట్ల ఆదాయం వస్తుందని.. దీనిని పెంచుకుంటూ పోయినా 30 ఏళ్లకు రూ.30 వేల కోట్ల ఆదాయం చేకూరేదని , విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని వారు కోరుతున్నారు. 

Latest Videos

click me!