రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టాలని కాంగ్రెస్ నాయకుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkat reddy comments on rythu bandhu) చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ (viral)గా మారాయి. ‘రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే ప్రశ్నించండి’ అని ఆయన అంటున్న వీడియో ఆన్ లైన్ లో (video viral on social media) చక్కర్లు కొడుతోంది.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నోరు జారారు. రైతు బంధు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా సమక్షంలో ఇలా మాట్లాడటంతో దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
అస్సాం సీఎం పగ్గాలు అమిత్ షా చేతిలో.. హిమంత శర్మ అత్యంత అవినీతిపరుడు - రాహుల్ గాంధీ
గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మంగళవారం మాట్లాడారు. పలు అంశాలను వెల్లడించారు. అయితే సందర్భంగా ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పటి వరకు రైతుబంధు పడలేదని అడుగుతున్నారని దీనిపై మీరేమంటారని ప్రశ్నించారు. దీనికి మంత్రి స్పందిస్తూ ‘రైతు బంధు పడలేదని అన్న వారిని చెప్పుతో కొట్టండి.. అంత ధైర్యం లేకపోతే ప్రశ్నించండి’ అంటూ బదులిచ్చారు.
మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాగా.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై మంత్రి మంగళవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే నెల నుంచి ప్రతీ ఇంటికి 200 యూనిట్ల మేరకు ఉచిత విద్యుత్ అందుతుందని వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల రాష్ట్రం గుల్ల అయిందని ఫైర్ అయ్యారు. ఖజానాను గుల్ల చేసిందని అన్నారు. అందుకే హమీల అమలులో కాస్త జాప్యం ఏర్పడుతున్నదని వివరించారు.
కాంగ్రెస్ ఎండ్రికాయల పార్టీ.. అందులోకి ఎవరైనా పోతారా ? - కొత్త ప్రభాకర్ రెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ముందుగానే చెప్పినట్టు వంద రోజుల్లో నెరవేరుస్తామని చెప్పారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోబోదని అన్నారు. ఇక గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖ మంత్రిగా పని చేసిన జగదీశ్ రెడ్డి జైలుకు పోవడం ఖాయం అని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తున్నామని మంత్రి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.