ఆయుర్వేదాన్ని నేను నమ్ముతాను: బాలకృష్ణ

Published : May 28, 2021, 01:29 PM IST
ఆయుర్వేదాన్ని నేను నమ్ముతాను: బాలకృష్ణ

సారాంశం

ఆయుర్వేదాన్ని తాను నమ్ముతానని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.  ఆయుర్వేదంలో దేశంలో గొప్ప గొప్ప వైద్యులు  ఉన్నారని ఆయన చెప్పారు.

హైదరాబాద్: ఆయుర్వేదాన్ని తాను నమ్ముతానని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు.  ఆయుర్వేదంలో దేశంలో గొప్ప గొప్ప వైద్యులు  ఉన్నారని ఆయన చెప్పారు.ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని హైద్రాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.  ఇండియాలో ఆయుర్వేదంలో గొప్ప గొప్ప వైద్యులున్నారని ఆయన గుర్తు చేశారు. ఆనందయ్య మందుపై స్పందించాలని  మీడియా కోరగా బాలకృష్ణ ఈ విధంగా స్పందించారు. ఆనందయ్య తయారు చేసిన మందు పనిచేస్తోందని తాను భావిస్తున్నానని ఆయన చెప్పారు. 

also read:భావితరాలకు ఎన్టీఆర్ స్పూర్తి: చంద్రబాబు నివాళులు

క్రీస్తు పూర్వమే శుశ్రుతుడు ఆయుర్వేదంలో గొప్పవైద్యుడని ఆయన గుర్తు చేశారు. అస్ట్రేలియాలోని  రాయల్ కాలేజీ ఆఫ్ సర్జరీలో ఆయన విగ్రహం ఉందని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.దండికోట విశ్వనాథ శాస్త్రి  ఆయుర్వేదంలో  పేరున్న వైద్యుడని ఆయన చెప్పారు. సంస్కృతంలో ఆయనకు మంచి పట్టుందన్నారు. విదేశీయులు ఆయనను ఇండియా నుండి తీసుకెళ్లారన్నారు. ఆయుర్వేదాన్ని మనం పెద్దగా పట్టించుకోకపోయినా విదేశీయులు మాత్రం ఆయుర్వేదంలోని కీలక అంశాలను  తమ దేశాల్లో  అమలు చేశారని ఆయన చెప్పారు.

 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో చలివానలు... ఏపీలో ఎనిమిది, తెలంగాణలో 23 జిల్లాలకు అలర్ట్
JD Lakshmi Narayana : సీబీఐ మాజీ బాస్ ఇంటికే కన్నం.. రూ. 2.58 కోట్ల భారీ మోసం ! ఎలా బోల్తా కొట్టించారంటే?