జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం... గ్రామాల్లో భారీ కేసులు, మళ్ళీ సెల్ఫ్ లాక్ డౌన్ (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 20, 2021, 3:58 PM IST
Highlights

తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన రేపుతోంది. జగిత్యాల జిల్లాలో కరోనా కేసులు పెరగడంతో గ్రామాలు సెల్ఫ్ లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. 

కరీంనగర్: తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ వేవ్ వైరస్ వ్యాప్తితో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇక థర్డ్ వేవ్ ఇంతకంటే ఎక్కువ ప్రమాదాన్ని సృష్టించనుందన్న హెచ్చరికల నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇలాంటి సమయంలో మరోసారి జగిత్యాల జిల్లాలో కరోనా విజృంభణ మొదలయ్యింది. 

జగిత్యాల జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. జిల్లాలోని మాల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో ఇవాళ 100మందికి కరోనా టెస్ట్ చేయగా ఏకంగా 32మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది గ్రామస్తులందరికి టెస్టులు చేయడానికి సిద్దమయ్యారు. 

వీడియో

కరోనా కేసుల సంఖ్య జిల్లాలో మళ్లీ పెరుగుతుండటంతో వెల్గటూర్ మండలం‌ ఎండపల్లి గ్రామంలో సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున‌ సెల్ప్ లాక్ డౌన్ విధించుకుంటున్నట్లు ఎండపల్లి గ్రామపంచాయతి తీర్మానం చేసింది. 19-07-2021 నుండి 01-08-2021 వరకి సెల్ఫ్ లాక్ డౌన్ అమల్లో వుంటుందని వెల్లడించారు.

read more  థర్డ్ వేవ్ భయం: కేటుగాళ్ల నయా దందా... పిల్లలకు ఫ్లూ వ్యాక్సిన్, తెరవెనుక కొన్ని ఫార్మా కంపెనీలు 

గ్రామంలో గుంపు గుంపులుగా తిరిగితే  రూ.1000 జరిమానా విధించనున్నట్లు తెలిపారు. గ్రామంలోని కిరాణం దుకాణాలు,హోటల్లకు ఉదయం 7 నుండి 9 గంటల వరకు మాత్రమే  అనుమతించారు. ఉల్లంఘిస్తే రూ.2000 జరిమానా విధించారు. 

ఇక మాస్క్ ధరించకుండా ఇంటినుండి బయటికి వస్తే రూ.1000 రూపాయల జరిమానా విధించాలని నిర్ణయించారు. బెల్ట్ షాపులు పూర్తిగా మూసివుంచాలని నిర్ణయించారు. అతిక్రమిస్తే రూ.5000 జరిమానా విధించాలని గ్రామ పంచాయితీ నిర్ణయించింది.  
 

click me!