
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్న ఆయనకు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు తదితరులు ఘనస్వాగతం పలికారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే సభలో అమిత్ షా ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కరీంనగర్ వెళతారు.. అంబేడ్కర్ మైదానంలో జరిగే ‘‘ సమరభేరీ ’’ సభలో ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడతారు.
ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి కంచుకోటలా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పునర్వైభవాన్ని అందుకోవడంతో పాటు తిరిగి పాత స్థానాలను కైవసం చేసుకునేందుకు బీజేపీ అధిష్టానం అమిత్‌షా బహిరంగసభను ప్లాన్ చేసింది. ఈ సభను విజయవంతం చేసేందుకు బీజేపీ శ్రేణులు ముమ్మరంగా శ్రమిస్తున్నాయి.