
ఆదిలాబాద్‌లో (adilabad) రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించాలంటూ టీఆర్ఎస్ (trs) ఎమ్మెల్యే జోగు రామన్న (jogu ramanna) ఇంటి ముట్టడి ఉద్రిక్తతకు దారి దాసింది. శాంతి నగర్‌లోని జోగ రామన్న ఇంటి ముట్టడికి యువజన కాంగ్రెస్ నాయకులు (nsui) , బీజేపీ (bjp) నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు యువజన కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఒకవైపు ఆందోళనకారులు, మరొక వైపు టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు మోహరించడంతో తోపులాట జరిగింది. చివరికి పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. లాఠీచార్జీ చేస్తున్న సమయంలో డీఎస్పీ కిందపడిపోయారు.