కేటీఆర్, హరీష్‌లు ప్రయాణిస్తున్న బస్సుపై కోడిగుడ్లు విసిరిన కాంగ్రెస్ శ్రేణులు, నల్గొండలో ఉద్రిక్తత

By Siva Kodati  |  First Published Feb 13, 2024, 4:21 PM IST

నల్గొండలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్‌రావులు ప్రయాణిస్తున్న బస్సుపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. 


నల్గొండలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో జరగనున్న బహిరంగసభకు ఆ పార్టీ అగ్రనేతలు కేటీఆర్, హరీష్‌రావులు బస్సులో హైదరాబాద్ నుంచి నల్గొండకు బయల్దేరారు. అయితే పట్టణంలోని వీటీ కాలనీలో కేటీఆర్ బృందం ప్రయాణిస్తున్న బస్సుపై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లు విసిరారు. నల్లచొక్కాలు ధరించి బస్సుకు అడ్డుపడిన వీరు.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్ట్‌లను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని తప్పుపడుతూ బీఆర్ఎస్ పార్టీ చలో నల్గొండకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓ బహిరంగ సభలో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సభకు దాదాపు 2 లక్షల మంది హాజరవుతారని అంచనా. కృష్ణానదిపై వున్న ఉమ్మడి ప్రాజెక్ట్‌లను కేంద్రానికి అప్పగించే విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్‌లను అప్పగించేది లేదని తెలంగాణ ప్రభుత్వం సోమవారం అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో చంద్రశేఖర్ రావు ఏం మాట్లాడతారోనని తెలుగు ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 

Latest Videos

click me!