
తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు సీనియర్ల నిర్ణయం పార్టీ శ్రేణుల్లో ఆసక్తిని రేకిత్తిస్తోంది. సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ ఎల్‌బీ నగర్ నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఆయన రెండు సార్లు నిజామాబాద్ ఎంపీగా పనిచేశారు. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈసారి ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటికే టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నారు.
ఇటు మరో సీనియర్ నేత జానారెడ్డి కూడా పోటీ చేస్తారా లేదా అన్నది ఆసక్తిని రేపుతోంది. ఆయన ఇంత వరకు ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకోలేదు. అయితే జానారెడ్డి నియోజకవర్గం నాగార్జున సాగర్ నుంచి ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయన ఇప్పటికే దరఖాస్తు సమర్పించారు. హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ నుంచి ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి అప్లికేషన్ పెట్టుకున్నారు.
ALso Read: తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్!.. 70 స్థానాలు కాంగ్రెస్‌వే..: ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు..
ఇక మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఆంథోల్ నుంచి పోటీకి దరఖాస్తు చేశారు. కాసేపట్లో గాంధీభవన్‌కు చేరుకోనున్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మధిర స్థానం నుంచి అప్లికేషన్ ఇవ్వబోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఈరోజు సాయంత్రం లోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి వుంటుంది. దీంతో గాంధీ భవన్‌కు నేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు 800 మంది దరఖాస్తు చేసకున్నారు.