ఆ ఫర్నిచర్ ప్రభుత్వానిది.. అడ్డుకున్న విద్యార్ధులు.. శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

By Siva KodatiFirst Published Dec 6, 2023, 6:18 PM IST
Highlights

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆఫీసులోని ఫర్నిచర్ తరలిస్తుండగా ఓయూ విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఆ ఫర్నిచర్ అంతా ప్రభుత్వానిదంటూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. 

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆఫీసులోని ఫర్నిచర్ తరలిస్తుండగా ఓయూ విద్యార్ధి సంఘాలు అడ్డుకున్నాయి. ఆ ఫర్నిచర్ అంతా ప్రభుత్వానిదంటూ విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్ధి నేతల ధర్నాతో అక్కడి నుంచి వెళ్లిపోయారు అధికారులు. ఫర్నిచర్ ప్రభుత్వానికి చెందిందని తెలియదంటూ వారు వివరణ ఇచ్చారు. మరోవైపు ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ఓయూ జేఏసీ నేతతో ఫోన్‌లో మాట్లాడారు టీజీవో ప్రధాన కార్యదర్శి . దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా .. మహబూబ్‌నగర్‌లో శ్రీనివాస్ గౌడ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2014, 2018లలో ఆయన ఇక్కడి నుంచి వరుసగా గెలుపొందారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్‌పై కాంగ్రెస్ అభ్యర్ధి యెన్నం శ్రీనివాస్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ హ్యాట్రిక్ సాధించాలని ఆశ పడినప్పటికీ  నిరాశే ఎదురైంది. బీజేపీ నుంచి మిథున్ రెడ్డి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. 
 

Latest Videos

click me!