మూన్నాళ్ల ముచ్చ‌టేనా.. తెలంగాణ కాంగ్రెస్‌పై రాజాసింగ్ సంచలన వ్యాఖ్య‌లు

By Mahesh RajamoniFirst Published Dec 6, 2023, 5:37 PM IST
Highlights

Telangana Congress: తెలంగాణ కొత్త ముఖ్య‌మంత్రిగా కాంగ్రెస్ నాయకుడు రేవంత్‌రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేయ‌బోతున్నారు. అయితే, బీఆర్ఎస్ నేత క‌డియం త‌ర‌హాలో తెలంగాణ కాంగ్రెస్ పాల‌న‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి.
 

Goshamahal BJP MLA T Raja Singh: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం పాలించదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తెలంగాణ‌లో ఎప్పుడూ లేనంతగా అసెంబ్లీ స్థానాల్లో విజ‌యం సాధించి కాంగ్రెస్ పార్టీ. గురువారం ఆ పార్టీ నాయ‌కుడు అనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. దీనికి సంబంధించి ఎల్బీ స్టేడియంలో ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఇలాంటి త‌రుణంటో భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) నాయ‌కుడు, గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. 

బుధ‌వారం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌లో కాంగ్రెస్ పాల‌న ఎక్కువ కాలం  సాగ‌దంటూ సంచ‌ల‌నానికి తెర‌లేపారు. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో బీజేపీ పాల‌న వ‌స్తుంద‌ని పేర్కొన్నారు. దీంతో ఆయ‌న వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ గా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు ప్రకటించిందని పేర్కొన్న ఆయ‌న వాటిని బూట‌క‌పు హామీలుగా కొట్టిపారేశాడు. తెలంగాణ భారీ అప్పులు చేసి కోట్లాది రూపాయల అప్పులు చేసి తిరిగి చెల్లించలేకపోతోంద‌నీ, ఆరు హామీల అమలుకు డబ్బులు ఎక్కడివని ప్రశ్నించారు.

'త్వరలోనే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం వస్తుంది.  ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్న‌ బీజేపీ ప్రభుత్వం మాత్రమే రాష్ట్రంలో అభివృద్ధిని తీసుకురాగలదు. ఏడాదికి మించి రాష్ట్రాన్ని పాలించడం కాంగ్రెస్ కు సాధ్యం కాదు' అని బీజేపీ పార్టీ కార్యాలయంలో విలేకరులతో అన్నారు. కాగా, నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 స్థానాలను గెలుచుకుంది. డిసెంబర్ 3న ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. కాంగ్రెస్ 64 సీట్లతో సేఫ్ మెజారిటీ సాధించి, అధికార పీఠం ద‌క్కించుకుంది. దీంతో వ‌రుస‌గా రెండుసార్లు ఛాంపియన్ గా నిలిచిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణలో ప్ర‌తిప‌క్షంలో కూర్చోనుంది.
 

click me!