పరిపూర్ణానంద నగర బహిష్కరణ: తీర్పు వాయిదా వేసిన హైకోర్టు

First Published Jul 24, 2018, 12:54 PM IST
Highlights

తనపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు విధించిన నగర బహిష్కరణపై స్వామి పరిపూర్ణనంద దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. 

తనపై హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు విధించిన నగర బహిష్కరణపై స్వామి పరిపూర్ణనంద దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. స్వామిజీ వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బహిష్కరణ ఉత్తర్వుల ఒరిజనల్ డాక్యుమెంట్లను ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వ న్యాయవాది పత్రాలను హైకోర్టుకు సమర్పించారు..

పిటిషన్‌లో భాగంగా తాను ఆదిలాబాద్, కరీంనగర్‌లో గతంలో పరిపూర్ణానంద ఇచ్చిన ప్రసంగాల ఆధారంగా బహిష్కరించారని పేర్కొన్నారు. కాగా, ఓ టీవీ ఛానెల్‌లో చర్చ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేశ్ శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా.. మహేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పరిపూర్ణానంద పాదయాత్ర చేయాలని నిర్ణయించడం.. శాంతిభద్రతల దృష్ట్యా స్వామిజీని తొలుత గృహనిర్భంధంలో ఉంచి.. అనంతరం ఆరు నెలల పాటు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే.. దీనిపై న్యాయపోరాటం చేయాలని పరిపూర్ణానంద స్వామి నిర్ణయించి హైకోర్టును ఆశ్రయించారు. 

click me!