మియాపూర్ భూములపై కేసీఆర్ ప్రభుత్వానికి షాక్

By narsimha lodeFirst Published Apr 16, 2019, 1:57 PM IST
Highlights

మియాపూర్ భూముల విషయంలో హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది.  మియాపూర్ భూముల సమస్య పరిష్కారమయ్యేంత వరకు కూడ ప్రభుత్వం కొనడం కానీ, వేరే వ్యక్తులకు అమ్మకూడదని హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్: మియాపూర్ భూముల విషయంలో హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది.  మియాపూర్ భూముల సమస్య పరిష్కారమయ్యేంత వరకు కూడ ప్రభుత్వం కొనడం కానీ, వేరే వ్యక్తులకు అమ్మకూడదని హైకోర్టు మంగళవారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మియాపూర్ భూములపై సేల్ డీడ్‌లను రద్దు చేయడాన్ని  హైకోర్టు తప్పు బట్టింది.  సేల్ డీడ్ ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ భూములపై సుప్రీం కోర్టులో ఉన్న కేసు పరిష్కారమయ్యేంతవరకు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

మియాపూర్ భూములను యధావిధిగా ఉంచాలని  స్టేటస్ కో ఆర్డర్‌ను హైకోర్టు ఇచ్చింది. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు ప్రభుత్వం కొనడం కానీ, వేరే వ్యక్తులకు ఈ భూములను విక్రయించకూడదని  హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
 

click me!