పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్

By narsimha lodeFirst Published Apr 16, 2019, 1:29 PM IST
Highlights

 తెలంగాణలో పదో తరగతి  గణితం పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలకు గాను ఆరు మార్కులను కలపాలని  విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది.
 

హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి  గణితం పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలకు గాను ఆరు మార్కులను కలపాలని  విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది.

తెలంగాణ రాష్ట్రంలో పదోతరగతి గణితం పరీక్షల్లో తప్పుడు ప్రశ్నలకు గాను  విద్యార్థులకు న్యాయం చేయాలని నిర్ణయం తీసుకొంది. గణితం ఒకటో పేపర్లో ఐదున్నర మార్కులను గణితం రెండో పేపర్లో అర మార్కును కలపాలని  నిర్ణయం తీసుకొన్నారు.

ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు ఈ విషయమై తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఈ పరిణామాల నేపథ్యంలో  తెలంగాణ విద్యాశాఖ ఆరు మార్కులను కలపాలని నిర్ణయం తీసుకొంది. 

అయితే ఆరు మార్కులను కలపాలనే నిర్ణయంపై కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. మరో వైపు విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా తెలంగాణ విద్యాశాఖాధికారులు చెబుతున్నారు. ఈ ప్రశ్నలకు జవాబు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులకు మాత్రమే ఈ ఆరు మార్కులను కలపాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకొంది.


 

click me!