హైకోర్టు జోక్యం సరికాదు: అసెంబ్లీ కూల్చివేతపై కేసీఆర్ ప్రభుత్వ వాదన

By narsimha lode  |  First Published Jul 25, 2019, 6:10 PM IST

ఎర్రమంజిల్ కూల్చివేతపై గురువారం నాడు కూడ హైకోర్టులో విచారణ సాగింది. ఎర్రమంజిల్ పురాతన భవనం కాదని ఎలా సంతృప్తి పరుస్తారని హైకోర్టు ప్రభుత్వాన్నిప్రశ్నించింది.


హైదరాబాద్: ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో  కోర్టులు జోక్యం చేసుకోకూడదని ఏపీ హైకోర్టులో వాదించారు.ఎర్ర మంజిల్ లో కొత్త అసెంబ్లీ నిర్మాణంపై విచారణను కోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది.

ఎర్రమంజిల్ ను కూల్చివేసి కొత్త అసెంబ్లీని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.ఈ విషయమై కోర్టులో దాఖలైన పిటిషన్‌పై  గురువారం నాడు కోర్టు విచారించింది.ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టు గత తీర్పులను  ప్రథు్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Latest Videos

undefined

అసెంబ్లీ నిర్మాణానికి ప్లానింగ్ లేకుండా హెచ్ఎండీఏ నుండి అనుమతి తీసుకోలేమని ప్రభుత్వం వాదించింది. ఎంత విస్తీర్ణం ఉందో చూసిన తర్వాతే హెచ్ఎండిఏ అనుమతిని కోరుతామని తెలిపింది.  

ట్రాఫిక్ సమస్యలతో పాటు ఇతర అన్ని పాలసీ విధానాలకు సంబంధించిన అంశాలు కూడ ప్రజా ప్రయోజనాల కోసమే ప్రభుత్వం డబ్బులను ఖర్చు పెడుతుందని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు.

ప్రస్తుతమున్న అసెంబ్లీ 102 ఏళ్ల క్రితం నిర్మించిందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం అసెంబ్లీ ఉన్న భవనం అసెంబ్లీ కోసం నిర్మించింది కాదని... రాజు నివాసం కోసం నిర్మించిన భవనమని ఆయన హైకోర్టుకు తెలిపారు. 

అయితే కాలక్రమేణ ఈ భవనం అసెంబ్లీగా మారిందని  ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.ఎర్రమంజిల్ పురాతన కట్టడం కాదని  ఎలా సంతృప్తి పరుస్తారని హైకోర్టు ప్రభుత్వ తరపు న్యాయవాదిని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

ఎర్రమంజిల్ కూల్చివేతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

 

click me!