కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్‌ సర్కార్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు

By narsimha lode  |  First Published Jan 27, 2020, 4:32 PM IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమవారం నాడు కీలక ఆదేశాలు ఇచ్చింది. 



హైదరాబాద్ :తెలంగాణ సచివాలయం డిజైన్లపై తీసుకొన్న నిర్ణయాలను ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీలోపుగా హైకోర్టుకు సమర్పించాలని   తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also read:సచివాలయం కూల్చివేతపై కేసీఆర్ కు హైకోర్టు షాక్

Latest Videos

undefined

సోమవారం నాడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త సచివాలయం, డిజైన్లు, ప్రణాళికలపై తుది నిర్ణయం తీసుకోవవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది.  ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను ఫిబ్రవరి 12లోపుగా తమకు తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది.

ఈ కేసు విచారణను ఈ ఏడాది ఫిబ్రవరి 12వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాన్ని కూల్చివేసి కొత్త సచివాలయాన్ని నిర్మించాలని తపలెట్టింది. దీంతో  కొత్త సచివాలయ నిర్మాణంపై హైకోర్టు సోమవారం నాడు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 
 
 

click me!