3 నెలల్లోపు పంచాయితీ ఎన్నికలు : హైకోర్టు

Published : Oct 11, 2018, 11:10 AM IST
3 నెలల్లోపు పంచాయితీ ఎన్నికలు : హైకోర్టు

సారాంశం

మూడు మాసాల్లోపు తెలంగాణలో పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని గురువారం నాడు హైకోర్టు  ఆదేశించింది.


హైదరాబాద్: మూడు మాసాల్లోపు తెలంగాణలో పంచాయితీ ఎన్నికలను నిర్వహించాలని గురువారం నాడు హైకోర్టు  ఆదేశించింది. పంచాయితీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండడం సరైంది కాదని కోర్టు అభిప్రాయపడింది.

పంచాయితీలకు  ప్రత్యేక  అధికారులను నియమించడం రాజ్యాంగానికి విరుద్దమని హైకోర్టు అభిప్రాయపడింది. మూడు మాసాల్లోపుగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు సూచించింది

తెలంగాణలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై గురువారం నాడు  కోర్టు విచారణ జరిపింది. మూడు మాసాలు మాత్రమే ప్రత్యేక అధికారులను కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

ఈ మూడు మాసాల్లోపుగా ఎన్నికల నిర్వహణకు గాను  చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు కోరింది. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి దాఖలైన పిటిషన్‌పై ఇవాళ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

PREV
click me!

Recommended Stories

Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే
Amazon: సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల‌కు ఢోకా లేదు.. హైద‌రాబాద్‌లో అమెజాన్ రూ. 58వేల కోట్ల పెట్టుబ‌డులు