మే 27న ఇంటర్ ఫలితాలు ఇవ్వాలి: హైకోర్టు ఆదేశం

Published : May 15, 2019, 01:26 PM IST
మే 27న ఇంటర్ ఫలితాలు ఇవ్వాలి: హైకోర్టు ఆదేశం

సారాంశం

ఈ నెల 27వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు  తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది.ఇంటర్ జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను పూర్తి చేసినట్టుగా ఇంటర్ బోర్డు బుధవారం నాడు హైకోర్టుకు తెలిపింది.

హైదరాబాద్: ఈ నెల 27వ తేదీన ఇంటర్ ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు  తెలంగాణ ఇంటర్ బోర్డును ఆదేశించింది.ఇంటర్ జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌ను పూర్తి చేసినట్టుగా ఇంటర్ బోర్డు బుధవారం నాడు హైకోర్టుకు తెలిపింది.

ఇంటర్ ఫలితాలపై బుధవారం నాడు హైకోర్టు విచారణ చేసింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ పూర్తి చేసినందున రేపు ఫలితాలను ప్రకటిస్తామని ఇంటర్ బోర్డు కోర్టుకు తెలిపింది. అయితే ఈ నెల 27వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని హైకోర్టు ఇంటర్ బోర్డును ఆదేశించింది.

ఈ నెల 27వ తేదీన ఇంటర్ ఫలితాలతో పాటు సమాధాన పత్రాలను కూడ వెబ్‌సైట్‌లో ఉంచాలని  హైకోర్టు ఆదేశించింది. మరో వైపు ఈ  కేసులో గ్లోబరినా సంస్థకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈ ఏడాది జూన్ 6వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

PREV
click me!

Recommended Stories

గంట‌కు 320 కి.మీల వేగం.. 3 గంట‌ల్లోనే హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరు బుల్లెట్ ట్రైన్‌. స్టేష‌న్లు ఇవే.
హైదరాబాద్‌లో రూ.100 కోట్లతో ఇన్నోవేషన్‌ పార్కు.. ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు.? దీని ఉపయోగం ఏంటి.?