లోన్ యాప్ లను బ్లాక్ చేయాలంటూ... తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశం..

By AN TeluguFirst Published Feb 4, 2021, 2:31 PM IST
Highlights

అనేక దారుణాలకు కారణమవుతున్న రుణ యాప్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. రుణయాప్ లను తొలగించేందుకు వెంటనే ప్లో స్టోర్ లను సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది. 

అనేక దారుణాలకు కారణమవుతున్న రుణ యాప్లను బ్లాక్ చేసేందుకు చర్యలు తీసుకోవలని తెలంగాణ డీజీపీకి హైకోర్టు ఆదేశించింది. రుణయాప్ లను తొలగించేందుకు వెంటనే ప్లో స్టోర్ లను సంప్రదించాలని న్యాయస్థానం సూచించింది. 

రుణయాప్‌ల నిర్వాహకులను కట్టడి చేసేలా, వారి ఆగడాలు ఇక సాగకుండా చూసేలా 
వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీకి ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు లాయర్ కళ్యాణ్ వేసిన పిల్ పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. 

చైనా రుణయాప్ వల్ల బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో రుణయాప్ వేధింపులపై నివేదిక సమర్పించాలని డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది. 

దీంతోపాటు రుణయాప్ మోసాల మీద హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లు కూడా నివేదికలు ఇవ్వాలని కోరింది. రుణయాప్‌లపై విచారణను మార్చి 18కి కోర్టు వాయిదా వేసింది. 

అయితే ఇప్పటికే  లోన్ యాప్స్ కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 200కి పైగా లోన్ యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ తొలగించింది. అలాగే మరో 450కి పైగా లోన్ యాప్స్‌ను తొలగించాలని పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు.

పోలీసుల విజ్ఞప్తితో యాప్స్ తొలగింపు ప్రక్రియను గూగుల్ మొదలుపెట్టింది. హైదరాబాద్ నుంచి 288 యాప్స్ తొలగింపుపై పోలీసులు లేఖ రాశారు. సైబరాబాద్‌లో 110 లోన్ యాప్స్.. రాచకొండ నుంచి 90 లోన్ యాప్స్ తొలగించాలని కోరారు.

ఇదే సమయంలో వందల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేశారు పోలీసులు. ఇప్పటి వరకు మూడు కమీషనరేట్లలో కలిపి రూ.450 కోట్ల నగదు సీజ్ చేశారు.

ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కొట్టేసిన డబ్బుతో చైనీయులు లోన్ యాప్‌లను నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు నలుగురు చైనీయులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

click me!