కమ్మ, వెలమ సంఘ భవనాల నిర్మాణానికి భూ కేటాయింపులు: తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు నోటీసులు

By Siva KodatiFirst Published Aug 18, 2021, 6:58 PM IST
Highlights

కమ్మ, వెలమ సంఘ భవనాల నిర్మాణానికి భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  ఖానామెట్‌లో కమ్మ, వెలమలకు ఐదెకరాల చొప్పున భూమిని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జీవో నెంబ 47ని కొట్టివేయాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. 

కమ్మ, వెలమ సంఘ భవనాల నిర్మాణానికి భూ కేటాయింపులపై తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వినాయక్ రెడ్డి పిల్‌పై సీజే హిమా కోహ్లీ, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఖానామెట్‌లో కమ్మ, వెలమలకు ఐదెకరాల చొప్పున భూమిని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. జీవో నెంబ 47ని కొట్టివేయాలని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వాదించారు. దీనిని పరిగణనలోనికి తీసుకున్న హైకోర్టు.. వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను వచ్చే నెల 28కి వాయిదా వేసింది. 

click me!