వామనరావు దంపతుల హత్య... కత్తులు తయారుచేసింది ఆ ముగ్గురే

By Arun Kumar PFirst Published Feb 24, 2021, 11:22 AM IST
Highlights

నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా లాయర్ దంపతులిద్దరిని అతి కిరాతకంగా నరికిచంపిన కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 

పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు లాయర్లు వామనరావు-నాగమణి దంపతుల దారుణ హత్య రాష్ట్రంలో సంచలనంగా మారింది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దంపతులిద్దరిని అతి కిరాతకంగా నరికిచంపిన కేసులో ఇప్పటికే పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మంగళవారం అర్థరాత్రి ఏ4 నిందితుడు బిట్టు శ్రీనివాస్ ని పోలీసులు కోర్టులో హాజరు పర్చారు. అతడికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో కరీంనగర్ జైలుకు తరలించారు.  

ఇక గత నాలుగు రోజులుగా కరీంనగర్ జైల్లో ఉన్న కుంట శ్రీను, చిరంజీవి, కుమార్ లను పోలీసులు వరంగల్ జైలుకి తరలించారు. ఈ ముగ్గురిని విచారించడానికి కస్టడీ కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా బిట్టు శ్రీనును కూడా అరెస్ట్ చేయడంతో అతడిని కూడా కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశాలున్నాయి.   

వామన్ రావు దంపతుల హత్యపై కొనసాగుతున్న దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో వున్న ఏ5 నిందితుడు ఊదరి లచ్చయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే హత్యకు ఉపయోగించిన కత్తులు తయారు చేసిన రఘు, శ్రీను, బాబులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. 

read more  3 నిమిషాల ముందు వెళ్లి, 5 నిమిషాల్లోనే వామన్ రావు దంపతుల హత్య

హత్య జరిగిన తరువాత కుంట శ్రీను,బిట్టు శ్రీను, కుమార్, లచ్చయ్య ల మధ్య 18 సార్లు ఫోన్ సంభాషణ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే కుంట శ్రీను- బిట్టు శ్రీను మధ్య 11 సార్లు ఫోన్ సంభాషణ జరిగినట్లు ఫోన్ కాల్ డేటా ద్వారా తెలుస్తోంది. 
 
ఇక న్వాయవాద దంపతుల మర్డర్ కేసును సీబీఐ కి అప్పగించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. సిట్ ఏర్పాటు చేసి ఫాస్ట్రాక్ కోర్ట్ తో విచారణ జరపాలని న్యాయవాదుల డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే న్యాయవాదుల హత్య కేసును సుమోటోగా స్వీకరించింది హై కోర్ట్. మార్చి 01న నివేదిక సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. 
 

click me!