కారు డిక్కీలో రూ.60 లక్షల కరెన్సీ..

Published : Feb 24, 2021, 10:51 AM IST
కారు డిక్కీలో రూ.60 లక్షల కరెన్సీ..

సారాంశం

కారు డిక్కీలో పట్టుబడ్డ కరెన్సీ కట్టలు కలకలం రేపాయి. తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన ఈ ఘటనలో పోలీసులు కరెన్సీని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తున్న అధికారులు ఓ కారు డిక్కీలో తరలిస్తున్న రూ. 60 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

చేవెళ్ల మండల కేంద్రంలోని షాబాద్ చౌరస్తాలో మంగళవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఓ కారు డిక్కీలో రూ. 60 లక్షలు తీసుకెళుతున్నట్లు గుర్తించారు. 

నగదు గురించి ఆరా తీయగా.. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి చెందినవిగా తెలిసింది. దీంతో పట్టుబడిన నగదును రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. ఆ తరువాత నగదును సీజ్‌ చేసి వివరాలు అందించాలని సంబంధిత వ్యక్తులకు సూచించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం