ధర్నాచౌక్ పై ఆంక్షలు తాత్కాలికంగా ఎత్తివేత

By Nagaraju TFirst Published Nov 13, 2018, 5:12 PM IST
Highlights

ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌పై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాత్కాలికంగా హైకోర్టు ఎత్తివేసింది. తెలంగాణ సర్కార్ ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

హైదరాబాద్‌: ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌పై తెలంగాణ ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాత్కాలికంగా హైకోర్టు ఎత్తివేసింది. తెలంగాణ సర్కార్ ఆంక్షలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ధర్నా చౌక్‌ వద్ద కార్యక్రమాల నిర్వహణకు 6 వారాల పాటు కోర్టు అనుమతి ఇచ్చింది. పోలీసుల అనుమతితో నిరసన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ధర్నాచౌక్‌ ఎత్తివేతపై ఏడాదిగా ప్రభుత్వం వివరణ ఇవ్వకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని తెలిపింది. 

ఇందిరా పార్క్‌ వద్ద ధర్నా చౌక్‌ ఎత్తివేయడాన్ని సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌, ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వరరావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. 

 

 

click me!