టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షపై హైకోర్టులో 5 పిటిషన్లు.. పూర్తి వివరాలు ఇవే..

Published : Jun 05, 2023, 12:11 PM IST
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 పరీక్షపై హైకోర్టులో 5 పిటిషన్లు.. పూర్తి వివరాలు ఇవే..

సారాంశం

తెలంగాణలో ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు  చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని మొత్తం 5 పిటిషన్లు హైకోర్టులో ఫైల్ అయ్యాయి.

తెలంగాణలో ఈ నెల 11న నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు  చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. గ్రూప్ 1 పరీక్షను వాయిదా వేయాలని మొత్తం 5 పిటిషన్లు హైకోర్టులో ఫైల్ అయ్యాయి. పేపర్ లీక్ కారణంగా గతంలో నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు  చేసిందని.. ఇప్పుడు పేపర్ లీక్‌కు కారణమైన వారితోనే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నారని పిటిషనర్లు పేర్కొన్నారు.  అయితే అన్ని పిటిషన్లను మధ్యాహ్నం వింటామని తెలంగాణ హైకోర్టు తెలిపింది.

టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారం వెలుగుచూసిన తర్వాత గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు పలు పరీక్షను రద్దు చేశారు. అయితే తాజాగా ఈ నెల 11న గ్రూప్ 1 పరీక్షను నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్దమైంది. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా విడుదల చేసింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సైట్ https://www.tspsc.gov.in / నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది. అయితే పేపర్ లీక్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎస్‌పీఎస్సీ చేతనే.. మళ్లీ పరీక్షను నిర్వహించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో అద్భుతం.. రూ. 350 కోట్ల‌తో ల‌గ్జ‌రీ హోట‌ల్‌. ఎక్క‌డో తెలుసా.?
ఉచితంగా రూ. 4 వేల వ్యాక్సిన్‌.. దేశ‌వ్యాప్తంగా టీకాల పంపిణీ. ఉప‌యోగం ఏంటీ? ఎవ‌రు తీసుకోవాలి.?