ఈ నెల 25న ఉప్పల్ లో క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం: హెచ్ఆర్‌సీలో న్యాయవాది సలీం ఫిర్యాదు

By narsimha lodeFirst Published Sep 20, 2022, 2:18 PM IST
Highlights

ఈ నెల 25వ తేదీన ఉప్పల్ లో జరిగే ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల విషయంలో అవకతవకలపై హెచ్ఆర్‌సీని ఆశ్రయించారు.  హైకోర్టు న్యాయవాది సలీం ఈ విషయమై హెచ్ఆర్‌సీలో ఫిర్యాదు చేశారు. 

హైదరాబాద్: ఈ నెల 25వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇండియా, అస్ట్రేలియా  మధ్య జరిగే   క్రికెట్ మ్యాచ్ టికెట్ల అవకతవకలపై హెచ్ఆర్‌సీని ఆశ్రయించారు హైకోర్టు న్యాయవాది సలీం. 

ఈ మ్యాచ్ కు సంబంధించి టికెట్లు బ్లాక్ అయ్యాయి. ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో టికెట్లు దొరకడం లేదు. ఈ మ్యాచ్ టికెట్లను బ్లాక్ లో హైద్రాబాద్ క్రికెట్ అసోసియేషన్ విక్రయిస్తుందని  ఆరోపణలు వస్తున్నాయి. జింఖానా గ్రౌండ్స్ లో ఆఫ్ లైన్లో టికెట్ల విక్రయం కోసం కౌంటర్లను ఏర్పాటు చేయాలి. కానీ ఇంతవరకు కౌంటర్లు ఏర్పాటు చేయలేదు. 

ఈ నెల 15నే ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం ప్రారంభించాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం ప్రారంభించలేదని క్రికెట్ అభిమానులు చెబుతున్నారు.  ఈ మ్యాచ్ టికెట్ల విక్రయం విషయమై సమగ్ర విచారణ జరిపించాలని హెచ్ఆర్‌సీలో హైకోర్టు న్యాయవాది సలీం ఫిర్యాదు చేశారు.

 ఈ మ్యాచ్ కు సంబంధించి 39 వేల టికెట్లను ఆఫ్ లైన్ లో విక్రయించాలి,. మిగిలిన టికెట్లను ఆన్ లైన్ లో విక్రయించాలి. కానీ ఇంతవరకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో టికెట్లు విక్రయించలేదు. ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్ లో ఎన్ని టికెట్లు విక్రయించారో చెప్పాలని హైకోర్టు న్యాయవాది డిమాండ్ చేశారు. ఆఫ్ లైన్ టికెట్ల విక్రయం కోసం ఎన్ని కౌంటర్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని కూడా ఆయన  కోరారు.   

ఇవాళ్టి నుండి ఆఫ్ లైన్ లో టికెట్ల విక్రయం జరుగుతుందని హెచ్ సీఏ  వర్గాలు ప్రకటించాయి. కానీ టికెట్ల విక్రయం చేయలేదు. జింఖానా స్టేడియం గేట్లు  కూడా తెరవలేదని క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. టికెట్ల కోసం జింఖానా స్టేడియం వద్ద క్రికెట్ అభిమానులు ఆందోళనకు దిగారు. 
 

click me!