నౌహీరా కేసులో ఈడీ దూకుడు.. రూ.400 కోట్ల ఆస్తులు అటాచ్

Siva Kodati |  
Published : Mar 25, 2023, 04:09 PM IST
నౌహీరా కేసులో ఈడీ దూకుడు.. రూ.400 కోట్ల ఆస్తులు అటాచ్

సారాంశం

నౌహీరా షేక్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దాదాపు రూ.400  కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది.

నౌహీరా షేక్ ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. దాదాపు రూ.400  కోట్ల ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఈడీ ప్రకటించింది. హీరా గోల్డ్, నౌహీరా షేక్ ఆస్తులను అటాచ్ చేస్తున్నట్లు ఏజెన్సీ తెలిపింది. మొత్తం 24 ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. తాజాగా రూ.33 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది ఈడీ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

కాగా.. డిపాజిట్ దారుల నుండి  సుమారు  రూ. 5 వేల కోట్లను  సేకరించారని నౌహీరా షేక్  పై ఆరోపణలున్నాయి. ఈ డిపాజిట్ దారులకు  సకాలంలో  డబ్బులు చెల్లించలేదని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో  నౌహీరా షేక్ పై  ఈడీ అధికారులు  కేసు నమోదు చేశారు. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో  నౌహీరా షేక్ ను 2018 అక్టోబర్ 17న హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 కంపెనీలకు నౌహీరా షేక్ ఛైర్మెన్ గా కొనసాగుతున్నారు. వేర్వేరు పేర్లతో ఈ కంపెనీలు నడిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!