హీరా గోల్డ్ స్కామ్: రూ. 70 కోట్ల ప్లాట్ల స్వాధీనం, రూ.300 కోట్ల జుప్తు

By telugu teamFirst Published Aug 8, 2020, 2:50 PM IST
Highlights

హీరా గోల్డ్ కుంభకోణం కేసులో నౌహీరా షేక్ కు చెందిన 70 కోట్ల రూపాయల విలువ చేసే 81 ప్లాట్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకు రూ.300 విలువ చేసే ఆస్తులను స్వాధీనం చేసుకుంది.

హైదరాబాద్: హీరా గోల్డ్ కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా నౌహెరా షేక్ కు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. హైదరాబాదులని టోలీచౌక్ లో గల 81 ప్లాట్లను స్వాధీనం చేసుకుంది. రెవెన్యూ, పోలీసుల సహకారంతో వాటిని ఈడీ జప్తు చేసింది. 

ఆ ప్లాట్ల విలువ 70 కోట్ల రూపాయల విలువ చేస్తుందని అంటున్నారు. దాంతో ఇప్పటి వరకు నౌహెరా షేక్ కు చెందిన రూ. 300 కోట్ల విలువ చేసే ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. హీరా గోల్డ్ రూ.5 వేల కోట్ల కుంభకోణంలో మనీలాండరింగ్ కేసును ఈడీ దర్యాప్తు చేస్తోంది. 

నౌహీరా షేక్ మీద మొత్తం పది కేసులున్నాయి. దాదాపు రూ.5600 కోట్ల మేరకు నౌహీరా షేక్ మోసం చేసినట్లు భావిస్తున్నారు. దాదాపు 1.72 లక్షల మంది ఇన్వెస్టర్లు మోసపోయారు. 2018 అక్టోబర్ 16వ తేదీన నౌహీరా షేక్ ను అరెస్టు చేశారు.

click me!