అమరవీరుల స్మారక చిహ్నాం ప్రారంభోత్సవం.. భారీ ర్యాలీ, నెక్లెస్‌ రోడ్‌లో ట్రాఫిక్ జాం

Siva Kodati |  
Published : Jun 22, 2023, 05:26 PM IST
అమరవీరుల స్మారక చిహ్నాం ప్రారంభోత్సవం.. భారీ ర్యాలీ, నెక్లెస్‌ రోడ్‌లో ట్రాఫిక్ జాం

సారాంశం

నెక్లెస్ రోడ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవం సందర్భంగా 3000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. 

అమరవీరుల స్థూపం ప్రారంభోత్సవం సందర్భంగా 3000 మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రసాద్ ఐమాక్స్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టారు. దీంతో నెక్లెస్ రోడ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వెంటనే స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. మరికాసేపట్లో అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. 12 తుపాకులతో అమరవీరులకు గన్ సెల్యూట్‌తో గౌరవ వందన సమర్పిస్తారు. దీంతో 21 రోజుల పాటు ఘనంగా జరిగిన తెలంగాణ అవతరణ దశాబ్ధి ఉత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ