హైద్రాబాద్ నగరంలో మంగళవారం నాడు వర్షం ప్రారంభమైంది. సోమవారం నాడు రాత్రి మూడు గంటల పాటు వర్షం కురిసింది. ఈ వర్షంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం నాడు మధ్యాహ్నం భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.సోమవారం నాడు సుమారు మూడు గంటలకు పైగా భారీ వర్షం కురవడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నిన్న నగరంలో సుమారు 13 సెం. మీ వర్ష పాతం నమోదైందని గణాంకాలు చెబుతున్నాయి. నిన్న రాత్రి కురిసిన వర్షంతో రోడ్లు జలమయంగా మారాయి. దీంతో గంటల తరబడి రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. కొద్దిదూరం ప్రయాణం చేయాలన్నా గంటలు గంటలు వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇవాళ మధ్యాహ్నం కూడా నగరంలో వర్షం ప్రారంభమైంది. నగరంలోని కూకట్ పల్లి, మియాపూర్, ఎర్రగడ్డ, అమీర్ పేట, కోఠి, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట, ఎల్బీనగర్, బాలాపూర్, ఆబిడ్ప్, సుల్తాన్ బజార్, అంబర్ పేట, బషీర్ బాగ్, ఖైరతాబాద్, లక్డీకపూల్, హిమాయత్ నగర్, నాంపల్లి, ముషీరాబాద్, కవాడీ గూడలలో వర్షం కురుస్తుంది.
undefined
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఇంకా రెండు రోజుల పాటు బారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి ఎవరూ రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు ప్రజలకు సూచించారు.
also read:హైద్రాబాద్‌లో భారీ వర్షం: లోతట్టు ప్రాంతాలు జలమయం, ట్రాఫిక్ జామ్
బషీర్ బాగ్ ఫ్లైఓవర్ కింద వర్షం నీరు చేరింది. ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వర్షం నీరు నిలిచింది. ఈ నీటిని తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. డీఆర్ఎస్ టీమ్ లు, మాన్ సూన్ బృందాలను జీహెచ్ఎంసీ సిద్దం చేసింది.