కొందరు అ:హంకారంతో వ్యవహరిస్తున్నారు: భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలనం

By narsimha lode  |  First Published Sep 27, 2022, 3:35 PM IST

భువనగరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల మొదటి వారంలోనే  పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తనకు ఇవ్వడం లేదని బూర నర్సయ్య గౌడ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 


హైదరాబాద్: కొందరు అహంకారంతో వ్యవహరిస్తున్నారని భువనగిరి మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత బూర నర్సయ్య గౌడ్ విమర్శించారు.మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. తనను అవమానిస్తే మునుగోడు ప్రజలను అవమానించినట్టేనని బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. తనకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఆహ్వానించకపోతే తన స్థాయి పడిపోదన్నారు. తనకు కేసీఆర్ ఒక్కడే నాయకుడన్నారు. కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా కూడా ఆ బాధ్యతను నిర్వర్తిస్తానని నర్సయ్య గౌడ్ చెప్పారు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాలకు  ఆహ్వానం అందకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానం ఎందుకు అందలేదో తెలియదన్నారు. అహంకారం స్వంత సమాధికి పునాదిగా ఆయన పేర్కొన్నారు. 

Latest Videos

undefined

ఈ నెల మొదటి వారంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్  మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలకు సంబంధించి తనకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఈ సమాచారం ఎందుకు ఇవ్వడం లేదో తనకు తెలియదన్నారు. మునుగోడు అసెంబ్లీ స్థానం టికెట్ అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు.

అయితే ఈ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి కూడ స్పందించారు. మాజీ ఎంపీ నర్సయ్యగౌడ్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ కు అందజేస్తామన్నారు. పార్టీ కార్యక్రమాల సమాచారం మాజీ ఎంపీకి ఎందుకు అందడం లేదో కనుక్కొంటామన్నారు.

also read:టీఆర్ఎస్ కార్యక్రమాలపై సమాచారం ఇవ్వడం లేదు: మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అసంతృప్తి

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ప్రచార బాధ్యతలను మంత్రి జగదీష్ రెడ్డి తన భుజాలపై వేసుకున్నారు.  మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీకి బూర నర్సయ్య గౌడ్ ఆసక్తిని చూపుతున్నారు. అయితే మంత్రి జగదీష్ రెడ్డి  మాత్రం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అభ్యర్ధిత్వం వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం సాగుతుంది. మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ కూడా  మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించి సమాచారం అందడం లేదని కూడా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ గతంలోనే ప్రకటించారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన చాకలి అయిలమ్మ  జయంతిని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో కర్నె ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చకు దారి తీశాయి. అగ్రవర్ణాలే  రాజ్యాధికారంలో ఉండాలనే పరిస్థితులు సమాజంలో ఉన్నాయన్నారు. చిన్న కులం వాడికి రాజ్యాధికారం వద్దు, పోరాటం చేయవద్దనే పరిస్థితులున్నాయన్నారు.మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే తాము సహకరించబోమని అసమ్మతి వర్గం చెబుతుంది. అయితే అసమ్మతి వర్గం నేతలతో పార్టీ నాయకత్వం చర్చలు జరుపుతుంది.

click me!