హైద్రాబద్‌లో భారీ వర్షం: సీతాఫల్‌మండిలో అత్యధికంగా 7.2 సెం.మీ వర్షపాతం

By narsimha lode  |  First Published May 4, 2022, 9:34 AM IST

హైద్రాబాద్ లో బుధవారం నాడు తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో అత్యధికంగా 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. 
 


హైదరాబాద్: Hyderabad నగరంలో బుధవారం నాడు తెల్లవారుజామున ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంట పాటు వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్ Sitaphalmandiలో అత్యధికంగా 7.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. వెస్ట్ మారేడ్ పల్లిలో 6.1, మల్కాజిగిరిలో 4.7 సెం.మీ. ఎల్బీ నగర్ లో 5.8 సెంమీ. , బన్సీలాల్‌పేట్‌లో 6.7సెంమీ, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9 సెంమీ. బేగంపేటలోని పాటిగడ్డలో 4.9సెం.మీ వర్షపాతం నమోదైంది.

కొత్తపేట, చైతన్యపురి, ఎల్బీనగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ , అమీర్ పేట,  చిలకలగూడ,ఉప్పల్, బోయిన్ పల్లి, తిరుమలగిరి తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు  తెలిపారు.

Latest Videos

undefined

Heavy Rains కారణంగా రోడ్లపైనే వరద నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీగా వర్షం కురిసిన ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బందిని జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది. రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని GHMCసిబ్బంది తొలగించే ప్రయత్నిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలను ప్రారంభించారు.

ఈదురు గాలులకు చెట్లు విరిగిపోయాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాల్లో Electricity కి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లైన్లను పునరుద్దరించేందుకు TSSPDCL సిబ్బంది ప్రయత్నాలు చేపట్టారు. హైద్రాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. 

గత మాసం నుండి వేసవి తాపంతో ఉన్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వడ దెబ్బతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మరణాలు కూడా చోటు చేసుకొన్నాయి. ఈ తరుణంలో ఈ వర్షాలు ప్రజలకు కొంత ఊరటను ఇచ్చాయి.

click me!