ఈ మూడురోజులూ తెలంగాణలో భారీ వర్షాలు... ఆ జిల్లాలకు అతి భారీ వర్షాల హెచ్చరిక

By Arun Kumar PFirst Published Jul 21, 2021, 11:10 AM IST
Highlights

తెలంగాణలో రానున్న మూడురోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ శాఖ ప్రకటించింది. 

హైదరాబాద్: తెలంగాణ రానున్న మూడురోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే  అవకాశం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని... మిగతా చోట్ల చెదురుమదురు జల్లులు కురిస్తాయని తెలిపింది. ఇక రేపు, ఎల్లుండి(గురు, శుక్రవారం) ఉరుములు,మెరుపులో కూడిని అతి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

ఇవాళ(బుధవారం) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. ఇక గురు,, శుక్రవారాల్లో ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ప్రకటించారు. అలాగే నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, జనగామ, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో కూడా రానున్న రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. 

read more  నిండిన హిమాయత్‌సాగర్ ప్రాజెక్టు: మూడు క్రస్ట్‌గేట్ల ఎత్తివేత

ఇక వర్షాలకు సంబంధించిన పాత వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత భ‌యాందోళనలకు పెంచుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. నగరంలో భారీ వరదలు వచ్చాయని, ఇళ్లు కూలిపోతున్నాయంటూ పాత వీడియోలను కొత్త వీడియోలుగా చూపుతూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నవారిపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ ఆగ్రహం వ్యక్తం చేశవారు. పాత వీడియోల‌ను కొత్తవిగా వైరల్‌ చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామ‌ని సీపీ  పేర్కొన్నారు. 

అయితే వర్షాల కారణంగా ఎక్కడైన సమస్య ఏర్పడితే, ఎవ‌రైనా ఇబ్బందులు ఎదుర్కొంటే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని మహేశ్ భగవత్ విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే సంబందిత సిబ్బంది సాయం చేస్తార‌ని ఆయ‌న వివ‌రించారు. స‌హాయ‌క బృందాలు, పోలీసులకు స‌హ‌క‌రించాల‌ని సీపీ ప్రజలను కోరారు. 

 

click me!