
హైదరాబాద్ : శుక్రవారం తెల్లవారుజామునుంచి హైదరాబాద్ ను వర్షం ముంచెత్తుతోంది. కొన్ని చోట్ల గురువారం సాయంత్రం నుంచే వర్షం మొదలయ్యింది. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గంటకు 30-40 కి.మీ వేగంలో ఈదురు గాలులు వీస్తాయని, రాగల మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వర్ష సూచన చేసింది. హైదరాబాద్ లో పలుచోట్ల చిరుజల్లులు, వర్షం కురుస్తున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి తదితర పాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నారు. అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్ నిజాంపేట్ లలో వర్షం పడుతోంది. చందానగర్, మియామూర్, కొండాపూర్ లలో వర్షం కురుస్తోంది.
తెల్లవారుజామునుంచి హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. దీనికి తోడు ఈదురు గాలులు వీస్తున్నాయి. మణికొండ, షేక్ పేట్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్ లలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. బంజారాహిల్స్ మసాబ్ ట్యాంక్, టోలీ చౌకీ, మెహెదీపట్నం, అత్తాపూర్, రాజేంద్రనగర్ లలో వర్షం కురుస్తోంది. గంటకు 30-40కి.మీ.ల వేగంతో వీస్తున్న ఈదురు గాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయి రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.