ఒక్కసారిగా మారిన వాతావరణం: ఏపీ,తెలంగాణల్లో వర్షాలు

By narsimha lodeFirst Published Jan 13, 2022, 11:14 AM IST
Highlights

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తున్నాయి.

హైదరాబాద్: Andhra pradesh, Telangana రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా rains కురుస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని guntur జిల్లా వేమూరులో, మాచర్లలో వర్షం కురుస్తుంది.ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలం, పొదిలిలో వర్షంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కృష్ణా జిల్లా విజయవాడ, గన్నవరం, ఎనికపాడులలో కూడా వర్షాలు కురుస్తున్నాయి.

 Telanganaలోని Hyderabadలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.ఉత్తర మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షం కురుస్తోంది. హైద్రాబాద్‌లోని బేగం బజార్, కోఠి, సుల్తాన్ బజార్, ఆబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హిమాయత్ నగర్, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, మారేడ్‌పల్లి, చిలకలగూడ, ప్యారడైజ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, జనగాం, కరీంనగర్‌, యాదాద్రి,   ఆదిలాబాద్‌, కొమురం భీం‌మ్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో  వర్షాలు పడినట్టుగా వాతావరణ కేంద్రం తెలిపింది.

 ఉపరితల ద్రోణి ఉత్తర ఇంటీరియర్‌ కర్ణాటక నుంచి ఉత్తర మధ్య మహారాష్ట్ర వరకు సముద్ర మట్టం నుంచి సగటు 0.9కి.మీ. ఎత్తు వద్ద ఏర్పడిందని వాతావరణ శాఖ ప్రకటించింది.సోమవారం రాత్రి నుంచే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం, బుధవారం చాలా చోట్ల మాదిరి వాన కురిసింది. 
 సిద్ధిపేట, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో  వర్షాలు కురిశాయి. రోడ్లమీదకు వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముంపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

గత ఏడాది చివర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. ప్రదానంగా కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను వర్షాలు ముంచెత్తాయి.ఈ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వందలాది ఎకరాల పంట నష్టపోయింది.
 

click me!