పప్పుల సురేష్ ఫ్యామిలీ సూసైడ్: పోలీసుల అదుపులో ముగ్గురు

Published : Jan 13, 2022, 10:29 AM IST
పప్పుల సురేష్ ఫ్యామిలీ సూసైడ్: పోలీసుల అదుపులో ముగ్గురు

సారాంశం

నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన వినీత, చంద్రశేఖర్ తో పాటు నిజమాబాద్ కు చెందిన జ్ఞానేశ్వర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

నిజామాబాద్: గత వారంలో విజయవాడలో నిజామాబాద్ కు చెందిన పప్పుల సురేష్ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో పోలీసులు ముగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గణేష్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ నెల 6వ తేదీన విజయవాడకు వెళ్లిన నిజామాబాద్ జిల్లాకు చెందిన Pappula Suresh కుటుంబం అక్కడే ఆత్మహత్య చేసుకొంది. ఆత్మహత్య చేసుకొనే ముందు సురేష్ సెల్ఫీ వీడియోను తీసుకొన్నాడు. సురేష్ ఆయన భార్య ఇద్దరు కొడుకులు కూడా ఆత్మహత్య చేసుకొన్నారు. సురేష్ Selfie Video తో పాటు సూసైడ్ లేఖను కూడా రాశాడు. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Nirmal  జిల్లాకు చెందిన Vineeta chandrashekar తో పాటు నిజామాబాద్ కు చెందిన గణేష్ తో పాటు జ్ఞానేశ్వర్ పేరును సెల్ఫీ వీడియోలో సురేష్ ప్రస్తావించారు. ఈ  వీడియో ఆధారంగా  వినీత, చంద్రశేఖర్,నిజామాబాద్ కు చెందిన జ్ఞానేశ్వర్ ను  పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. గణేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.నిజామాబాద్ కు చెందిన వడ్డీ వ్యాపారులకు రాజకీయ పార్టీల అండదండలున్నాయని కూడా సురేష్ బంధువులు చెబుతున్నారు. ఈ కారణంగానే పోలీసులు వారిపై చర్యలకు వెనుకాడుతున్నారని ఆరోపిస్తున్నారు. 

సురేష్ కు ఈ నలుగురు ఎంత మేరకు అప్పులు ఇచ్చారు. సురేష్ వారికి ఎంత మేరకు అప్పులు తీర్చాడు, ఏ మేరకు వడ్డీ కింద చెల్లించాడనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వడ్డీ వ్యాపారులు తీవ్రంగా వేధింపులకు గురి చేయడం వల్లే  సురేష్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టుగా  మృతుల బంధువులు చెబుతున్నారు. 

వడ్డీ వ్యాపారులు సురేష్ కుటుంబాన్ని వేధింపులకు గురి చేసినట్టుగా బంధువులు చెబుతున్నారు. సురేష్  ఇంటికి మహిళలతో వచ్చి వేధింపులకు గురి చేశారని బంధువులు పోలీసులకు చెప్పారు. మరో వైపు సురేష్ ఇంటిని తాము స్వాధీనం చేసుకొన్నామని కూడా ఇంటిపై రాయడం కూడా సురేష్  కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. 

ఈ పరిణామాలతో విజయవాడలో కనకదుర్గమ్మ దర్శనం కోసం వెళ్లిన సురేష్ కుటుంబం అక్కడే ఆత్మహత్య చేసుకొంది.

పప్పుల సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకొన్న తర్వాత వడ్డీ వ్యాపారుల ఆగడాలను అడ్డుకొంటామని నిజామాబాద్ సీపీ నాగరాజు చెప్పారు.  వడ్డీ వ్యాపారులు వేధింపులకు గురిచేస్తే తమను ఆశ్రయించాలని సీపీ సూచించారు. వడ్డీ వ్యాపారులు  వేధిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన చెప్పారు.  సురేష్ కుటుంబం తమను ఆశ్రయిస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పోలీసులు చెబుతున్నారు.

నిజామాబాద్ లో వడ్డీ వ్యాపారులకు రాజకీయ పార్టీల అండదండలున్నాయి. దీంతో  వారంతా ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. అయితే సురేష్ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడంతో పోలీస్ శాఖలో చలనం వచ్చింది. అయితే ఇంత కాలం పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలను పోలీసులు చూసీ చూడనట్టుగా వ్యవహరించారనే విమర్శలు కూడా లేకపోలేదు.అయితే సురేష్ కుటుంబం ఆత్మహత్యకు ముందు బంధువులకు పంపిన సెల్ఫీ వీడియో తో పాటు ఇతర ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నిఘా నీడలో తెలంగాణ ఆర్టీసీ ఆకతాయిలు, పోకిరీలకు చెక్ | CCTV in TSRTC buses | Asianet News Telugu
CM Revanth Reddy Praises Nirmal Women’s Groups for 100% Loan Repayment | Asianet News Telugu