TS Assembly: అసెంబ్లీలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. వాడిగా కామెంట్లు

By Mahesh K  |  First Published Dec 16, 2023, 4:32 PM IST

తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈ రోజు సమావేశం హోరెత్తిపోయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య హీట్ హీట్‌గా వాదనలు జరిగాయి. ఎవరూ వెనక్కి తగ్గకుండా బలమైన వాదనలు చేశారు. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.
 


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో వేడిగా, వాడిగా కామెంట్లు వచ్చాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై హాట్ హాట్‌గా మాటలు వచ్చాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, అటు విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. బీజేపీ ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీల దాడిని మంత్రులు ధీటుగానే ఎదుర్కొన్నారు. కేటీఆర్ వర్సెస్ పొన్నం, భట్టి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు అందరూ కౌంటర్లు ఇచ్చారు. అలాగే.. బీజేపీ నుంచి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు.

బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు కురిపిస్తూ.. మంత్రులు ఆ పార్టీ ఇచ్చిన 412 హామీలపై మాట్లాడటం లేదని అన్నారు. ప్రతి రోజూ దర్బార్ అని చెప్పి దాన్ని రెండు రోజులకే పరిమితం చేశారని వివరించారు. ప్రగతి భవన్‌ను స్టడీ సెంటర్ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇపపుడు దాన్ని భట్టి అధికారిక నివాసంగా మారుస్తున్నారని పేర్కొన్నారు.

Latest Videos

undefined

శ్వేతపత్రం విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేస్తున్నదని, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చూపెట్టి హామీల అమలును నిలిపేస్తే మాత్రం తాము ఊరుకోబోమని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చిందని, అయినా.. ప్రజలు బొటాబొటి మెజార్టీనే ఇచ్చారని అన్నారు. రేవంత్ రెడ్డి అదృష్టవంతుడని, ఓ చోట ఓడిపోయినా.. సీఎం అయ్యాడని, ఆయనకు పాలనాపరమైన అనుభవం లేకున్నా అనుభవజ్ఞులైన మంత్రుల సూచనలతో ముందుకు వెళ్లుతున్నారని తెలిపారు. ప్రభుత్వం మంచి పనులు చేస్తే.. తాము అందుకు మద్దతు ఇస్తామని, కానీ, హామీలను విస్మరిస్తే మాత్రం వదిలిపెట్టబోమని అన్నారు.

Also Read: కొంతమంది ఎన్నారైలకు ప్రజాస్వామ్య స్పూర్తి తెలియదు.. కేటీఆర్ కు రేవంత్ రెడ్డి చురక...

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ప్రయత్నం చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. ఒక వేళ జాతీయ హోదా ఇవ్వకుంటే ప్రాజెక్టును ముందుకు తీసుకుపోరా? అని నిలదీశారు. 

తెలంగాణ ప్రజల కోసం పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇప్పించాలని బీజేపీ ఎమ్మెల్యేలను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. అందుకు తామంతా బీజేపీ వెంట ఉంటామని చెప్పారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. బీజేపీతో కలిసి పని చేస్తాం అనడాన్ని తాము స్వాగతిస్తున్నామని, ఇందుకోసం ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుదామని తెలిపారు.

click me!