హెచ్‌సీఏ సంచలన నిర్ణయం.. ఆన్‌లైన్‌లో భారత్- ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్లు, రాత్రి 7 నుంచి విక్రయాలు

By Siva KodatiFirst Published Sep 22, 2022, 4:48 PM IST
Highlights

ఈ నెల 25న జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్ల విక్రయాల సందర్భంగా గురువారం సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యంలో హెచ్‌సీఏ కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 7 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ యాప్ ద్వారా విక్రయాలు జరుపుతామని తెలిపింది. 

ఈ నెల 25న జరగనున్న భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్‌కు సంబంధించి జింఖానా గ్రౌండ్‌లో గురువారం టికెట్లు విక్రయించగా తొక్కిసలాట జరిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌లైన్‌కు బదులు ఆన్‌లైన్‌లో మ్యాచ్ టికెట్లు విక్రయించాలని హెచ్‌సీఏ నిర్ణయించింది. దీనిలో భాగంగా రాత్రి 7 గంటల నుంచి పేటీఎం ఇన్‌సైడర్ యాప్ ద్వారా విక్రయాలు జరుపుతామని తెలిపింది. అంతకుముందు జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల విక్రయాలను హెచ్‌సీఏ నిలిపివేసింది. టికెట్లు అయిపోయాయని అధికారులు ప్రకటించడంతో క్యూలో నిలబడ్డ అభిమానులను పోలీసులు వెనక్కి పంపుతున్నారు. మరోవైపు.. హెచ్‌సీఏ, అధికారులు, పోలీసుల మధ్య సమావేశం ముగిసింది. 

ఇకపోతే జింఖానా గ్రౌండ్ర్స్ లో తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని తెలంగాణ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. గురువారం నాడు హైద్రాబాద్ లో మంత్రి మీడియాతో మాట్లాడారు. జింఖానా గ్రౌండ్స్ వద్ద తొక్కిసలాట ఘటనపై కేసులు నమోదు చేస్తామన్నారు. భారత్, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విక్రయాల బాధ్యత హెచ్‌సీఏదేనని మంత్  చెప్పారు. ఈ విషయమై తమను అడిగితే ఏర్పాట్లకు సహకరించే వాళ్లమన్నారు. తెలంగాణ ప్రతిస్టను ఎవరూ దెబ్బతీసినా ఊరుకునేది లేదని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. 

ALso REad:జింఖానా గ్రౌండ్‌లో టికెట్ల విక్రయాలు నిలిపివేత.. క్యూలైన్లను ఖాళీ చేయిస్తోన్న పోలీసులు

కాగా.. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో  ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్  ఉంది. ఈ మ్యాచ్ టికెట్ల విషయమై క్రికెట్ అభిమానులు వారం రోజులుగా హెచ్ సీ ఏ, జింఖానా గ్రౌండ్ల చుట్టూ తిరుగుతున్నారు. టికెట్ల విక్రయంలో గోల్ మాల్ చోటు చేసుకుందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆఫ్ లైన్ లో టికెట్ల విక్రయం కోసం క్రికెట్ అభిమానులు ఆందోళనలు చేశారు. దీంతో ఇవాళ జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల విక్రయం చేస్తామని హెచ్ సీ ఏ ప్రకటించింది.  

అయితే టికెట్ల విక్రయానికి సంబంధించి సరైన ఏర్పాట్లు చేయలేదు. పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు జింఖానా గ్రౌండ్ వద్దకు తరలి వచ్చారు.  టికెట్ కౌంటర్ ప్రారంభించిన గంటన్నర తర్వాత కూడా ఒక్క టికెట్ కూడా విక్రయించలేదు.  అదే సమయంలో  వర్షం రావడంతో గేటు వైపునకు పెద్ద ఎత్తున క్యూ లైన్లలో ఉన్నవారు వచ్చారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడగా ఓ యువతి పరిస్థితి విషమంగా ఉంది.

click me!