బహిరంగ ప్రదేశలో రబ్బరు బుల్లెట్లతో గాల్లోకి కాల్పులుజరపడం చట్ట వ్యతిరేకమేనని నేషనల్ రైపిల్ అసోసియేషన్ తెలిపింది. ఈ ఏడాది ఆగష్టు 13న మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ లో గాల్లోకి కాల్పులు జరిపిన విషయమై అందిన ఆర్టీఐ ధరఖాస్తుకు ఎన్ఆర్ఐఏ స్పందించింది.
హైదరాబాద్: పబ్లిక్ ప్రదేశంలో రబ్బరు బుల్లెట్లతో గాల్లోకి కాల్పులు జరపడం కూడా చట్ట విరుద్దమేనని ఎన్ఆర్ఏఐ తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 13వ తేదీన మహబూబ్ నగర్ లో నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పోలీసులు ఉపయోగించే ఎస్ఎస్ఆర్ తో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన ఆ సమయంలో రాజకీయంగా కలకలం చేపింది. కాంగ్రెస్, బీజేపీ నేతలు ఈ విషయమై తీవ్రంగా విమర్శలు చేశారు. అయితే తాను ఉపయోగించిన ఆయుధంలో రబ్బరు బుల్లెట్లు మాత్రమే ఉన్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.
also read:ఫ్రీడమ్ ర్యాలీలో పోలీస్ గన్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు, వీడియో వైరల్
undefined
అంతేకాదు తాను రైపిల్ అసోసియేషన్ సభ్యుడిని కూడా అని ఆయన వివరణ ఇచ్చారు. బహిరంగ ప్రదేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరపడంపై కొందరు నేషనల్ రైఫిల్ అసిసోయేషన్ లో ఆర్టీఐ కింద సమాచారం కోరారు. ఆర్టీఐ చట్టం మేరకు చేసిన ధరఖాస్తు మేరకు ఎన్ఆర్ఏఐ సమాచారం ఇచ్చింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ అసోసియేషన్ సభ్యుడిగా ఎన్ఆర్ఏఐ ప్రకటించింది. అయితే పబ్లిక్ ప్రదేశంలో కాల్పులు జరపడం చట్టవిరుద్దమేనని అసోసియేషన్ తేల్చి చెప్పిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఏబీఎన్ కథనం ప్రసారం చేసింది. ఈ విషయమై మంత్రి వివరణ కోరేందుకు ప్రయత్నిస్తే ఆయన స్పందించలేదని కూడా ఆ చానెల్ ఆ కథనంలో తెలిపింది.
ఈ ఏడాది ఆగస్టు 23న ఈ విషయమై ఆర్టీఐ కార్యకర్త రాబిన్ జాకియాస్ ఎన్ఆర్ఏఐకి ధరఖాస్తు చేశాడు. ఎన్ఆర్ఏఐకి ధరఖాస్తు చేశాడు. రబ్బరు బుల్లెట్లతో గాల్లోకి పబ్లిక్ ప్రదేశంలో కాల్పులు జరపడం సహ ఆరు ప్రశ్నలు వేశాడు. గత ఏడాది ఫిబ్రవరి 5వ తేదీ నుండి తమ అసోసియేషన్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ సభ్యుడని ఎన్ఆర్ఏఐ తెలిపింది. ఒక పోలీసుకు ఇచ్చిన సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ తో గాల్లోకి కాల్పులు జరపడానికి సభ్యుడిని అనుమతించారా అని అడిగిన ప్రశ్నకు ఎన్ఆర్ఏఐ తిరస్కరించిందని ఆ కథనం తెలిపింది.