పద్మా దేవేందర్ రెడ్డి భర్తపై చర్యలేవి..? హైకోర్టు సీరియస్..!

Published : Dec 25, 2021, 09:26 AM IST
పద్మా దేవేందర్ రెడ్డి భర్తపై చర్యలేవి..? హైకోర్టు సీరియస్..!

సారాంశం

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డి.. పీఏసీఎస్‌ సీఈవో గోపాల్‌రెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారని సహకార శాఖ రిజిస్ట్రార్‌ కమ్‌ కమిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. 

టీఆర్ఎస్ ఎమ్మెల్యే  పద్మా దేవేందర్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఆమె భర్త దేవేందర్ రెడ్డిపై నిధుల దుర్వినియోగం కేసులో.. చర్యలు ఎందుకు తీసుకోలేదని.. హైకోర్టు ప్రశ్నించడం గమనార్హం.

మెదక్‌ జిల్లాలోని కోనాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం( పీఏసీఎస్‌)లో నిధుల దుర్వినియోగంపై పీఏసీఎస్‌ అధ్యక్షుడు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి భర్త దేవేందర్‌రెడ్డి.. పీఏసీఎస్‌ సీఈవో గోపాల్‌రెడ్డిపై ఏం చర్యలు తీసుకున్నారని సహకార శాఖ రిజిస్ట్రార్‌ కమ్‌ కమిషనర్‌ను హైకోర్టు ప్రశ్నించింది. 

Also Read: హరీష్, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఇళ్లలోనూ సోదాలు: తలసాని

పీఏసీఎస్‌లో నిధులు పక్కదారి పట్టడంపై డైరెక్టర్లు ఇచ్చిన ఫిర్యాదుతో కమిషనర్‌ దర్యాప్తు నిర్వహించారు. రూ.2.26 కోట్లను దేవేందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి తదితరులు పక్కదారి పట్టించినట్లు విచారణలో తేలింది. అయితే.. వారిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదని.. చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని పీఏసీఎస్‌ డైరెక్టర్లు మహిపాల్‌రెడ్డి, సిద్దిరాములు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ వినోద్‌కుమార్‌ ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేసింది.

Also Read: ప్రగతి భవన్ వద్ద పద్మా దేవేందర్ రెడ్డికి షాక్: నరసింహన్ వీడ్కోలుకు ఈటల హాజరు

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?