హైదరాబాద్ శివారులో డ్రగ్స్‌ విక్రయిస్తూ పట్టుబడ్డ నైజీరియన్.. విచారణలో వెలుగులోకి కీలక విషయాలు..

By Sumanth Kanukula  |  First Published Jan 7, 2023, 3:39 PM IST

హైదరాబాద్ నగర శివారులో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని వనస్థలిపురంలో 178 గ్రాముల కొకైన్‌ను హయత్‌నగర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు.



హైదరాబాద్ నగర శివారులో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. నగర శివార్లలోని వనస్థలిపురంలో 178 గ్రాముల కొకైన్‌ను హయత్‌నగర్ ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్‌ను అరెస్ట్ చేవారు. డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తీసుకొచ్చి నగరంలో అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. నిదితుడి పేరు గాడ్విన్ ఇతియాన్యి అని, అతడు నైజీరియా దేశానికి చెందనివాడని తెలిపారు. 

పార్క్ దగ్గర అతడిని పట్టుకున్న సమయంలో 20 గ్రాముల కొకైన్ దొరికిందని చెప్పారు. గ్రాముకు రూ. 10 వేల చొప్పున విక్రయిస్తున్నాడని తెలిపారు. వనస్థలిపురంలోని అతడు అద్దెకు ఉంటున్న ప్లాట్‌లో 158 గ్రాముల కొకైన్ దొరికిందని చెప్పారు. మొత్తంగా అతని నుంచి 178 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలిపారు. దాని విలువ రూ. 17,80,000 ఉంటుదన్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగు చూశాయని చెప్పారు.  

Latest Videos

‘‘బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా నిందితుడు విచారణలో చెప్పాడు. అస్లాం అనే వ్యక్తి డ్రగ్స్ ఇచ్చినట్టుగా తెలిపాడు. ఇతడు 2022 మేలో దూల్‌పేటలో 48 గ్రాముల కొకైన్ అమ్ముతూ పట్టుబడ్డాడు. అక్కడ మాత్రం అతడి వివరాలు అన్ని తప్పుగా చెప్పాడు. అతని వద్ద ఫేక్ పాస్‌పోర్టు, ఫేక్ వీసా ఉన్నాయి. అప్పుడు పట్టుబడిన సమయంలో తన పేరు మోరిస్ బసగ్నియా అని, ఘనా దేశానికి చెందినవాడినని చెప్పాడు. అయితే వాస్తవానికి అతడు నైజీరియా దేశస్తుడు’’ అని చెప్పారు. ఇక, నిందితుడి వెనక ఏమైనా స్థానిక ముఠాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
 

click me!