హైటెక్ పద్దతిలో కాపీయింగ్‌కు యత్నం: హర్యానా యువకుడు హైద్రాబాద్‌లో అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 21, 2021, 12:04 PM IST
Highlights


హైటెక్ పద్దతిలో కాపీయింగ్ కు పాల్పడేందుకు యత్నించిన  హర్యానాకు చెందిన యువకుడు సౌరబ్ ను హైద్రాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వాయిసేన పరీక్షలో పాల్గొనేందుకు వచ్చిన నిందితుడు ఆన్ లైన్ పరీక్షల్లో హైటెక్ కాపీయింగ్ కు యత్నించినట్టుగా గుర్తించి పోలీసులకు అప్పగించారు.

హైదరాబాద్: హైటెక్ పద్దతిలో కాపీయింగ్ కు యత్నించిన  హర్యానాకు చెందిన సౌరబ్ అనే యువకుడిని హైద్రాబాద్ సరూర్‌నగర్ కు చెందిన పోలీసులు అరెస్ట్ చేశారు.ఇంటర్ పూర్తి చేసిన సౌరభ్  బీఏ తొలి సంవత్సరం చదువుతున్నాడు.  వాయిసేనలో ఎయిర్‌మెన్ ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకొన్నాడు. ఆన్‌లైన్ లో పరీక్ష రాయాల్సి ఉంది.  అయితే గూగుల్, యూట్యూబ్ ల్లో వెతికి ప్రత్యేక డివైజ్ ను  తయారు చేయించుకొన్నాడు. హర్యానాలోని తన స్నేహితుల ద్వారా తాను ప్రత్యేకంగా చేయించుకొన్న డివైజ్ ద్వారా  సమాధానాలు రాయాలని భావించాడు. 

సౌరబ్ కు కర్మన్ ఘాట్ లోని ఎస్ఈజడ్ టెక్నాలజీస్ పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు.  పరీక్షా కేంద్రంలోకి వెళ్లే సమయంలో రిసీవర్, ఎలక్ట్రానిక్ పరికరాలను  తన లో దుస్తుల్లో దాచుకొన్నాడు.  పరీక్షా కేంద్రంలోకి వెళ్లగానే  రిసీవర్ ను సెట్ చేసుకొన్నాడు. ఆ తర్వాత ఆయన తనకు కేటాయించిన కంప్యూటర్ వద్దకు చేరుకొన్నాడు. అయితే సౌరబ్ తీరు అనుమానంగా ఉన్న విషయాన్ని పరీక్ష నిర్వహకులు సీసీ కెమెరాల పుటేజీ ద్వారా పరిశీలంచారు. మరో సారి ఆయనను పరీక్షిస్తే ఎలక్ట్రానిక్ డివైజ్ లు లభ్యమయ్యాయి. నిందితుడిని అధికారులు  సరూర్ నగర్ పోలీసులకు అప్పగించారు.

click me!