కాచీగూడలో దారుణం... కన్నకూతురిపైనే కసాయి తండ్రి అత్యాచారయత్నం

Arun Kumar P   | Asianet News
Published : Jul 21, 2021, 11:45 AM IST
కాచీగూడలో దారుణం... కన్నకూతురిపైనే కసాయి తండ్రి అత్యాచారయత్నం

సారాంశం

మానవ బంధాలకు మచ్చ తెచ్చే దారుణం హైదరాబాద్ లోొ చోటుచేసుకుంది. కంటికిరెప్పలా కాపాడుకోవాల్సిన కన్న కూతురిపైనే కన్నేసిన ఓ తాగుబోతు తండ్రి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. 

హైదరాబాద్: మద్యంమత్తులో విచక్షణను కోల్పోయిన ఓ తాగుబోతు కన్న కూతురిపైనే అఘాయిత్యానికి యత్నించాడు. మానవ సంబంధాలకే మచ్చ తెచ్చే ఈ దారుణ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో చోటుచేసుకుంది. అయితే తాగుబోతు భర్త నీచపు ఆలోచనను పసిగట్టిన భార్య తన కూతురిని కాపాడుకుంది. 

వివరాల్లోకి వెళితే... ఉపాధి నిమిత్తం కుటుంబంతో కలిసి హైదరాబాద్ కు వలసవచ్చిన ఓ వ్యక్తి కాచిగూడలో నివాసముంటున్నాడు. కూలీ పనులు చేసుకునే అతడు తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం ఫూటుగా మద్యం సేవించి ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను వేధించేవాడు.  

read more  మైనర్ బాలుడిపై అత్యాచారం, హత్య.. దోషికి జీవితఖైదు

అయితే అతడు మంగళవారం కూడా మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన అతడికి 16ఏళ్ల కూతురు ఒంటరిగా కనిపించింది. దీంతో వావివరసలు మరిచి ఆమె మీదపడి పశువులా ప్రవర్తించాడు. తండ్రి చేష్టలతో అవాక్కయిన బాలిక తనను తాను కాపాడుకునేందుకు ప్రయత్నించింది. అయినా అతడు వదిలిపెట్టకుండా అత్యాచారానికి యత్నించాడు. 

ఇదే సమయంలో ఇంటికి వచ్చిన బాలిక తల్లి భర్త నుండి కూతురిని కాపాడింది. కన్న కూతురిపైనే అత్యాచారయత్నానికి పాల్పడిన సదరు దుర్మార్గుడిని పోలీసులకు అప్పగించింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం