టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో హరీష్ రావు

By telugu teamFirst Published Apr 27, 2019, 11:51 AM IST
Highlights

టీఆర్ఎస్ పార్టీ స్థాపించి నేటికి సరిగ్గా 18 సంవత్సరాలు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారు.


టీఆర్ఎస్ పార్టీ స్థాపించి నేటికి సరిగ్గా 18 సంవత్సరాలు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు పార్టీ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారు.ఈ నేపథ్యంలో.. సిద్ధిపేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ...టీఆర్ఎస్ పార్టీ 18 సం. పూర్తి చేసుకొని 19 వ సం. అడుగుపెడుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ కు,టీఆర్ఎస్ నాయకులకు ,కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.2001 ఏప్రిల్ 27 జలదృశ్యం లో ప్రారంభం అయిన ఈ ఉద్యమం ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పరిపాలనలో కూడా దేశానికే ఆదర్శంగ నిలవడం గర్వకారణం అని..  ఏప్రిల్ 27 చరిత్రలో లిఖించదగిన రోజన్నారు.

అదే స్ఫూర్తితో  తెలంగాణ అభివృద్ధిలో  ప్రతి ఒక్కరు బాగాస్వామ్యం కావాలని మరొక సారి ప్రజల ఆకాంక్షను నెరవేర్చే దిశగా  కార్యకర్తలు పునరంకితం కావాలన్నారు.ఈ రోజు ఉద్యమం చేసి ర్రాష్టాన్ని సాదించమంటే ఎందరో కార్యకర్తల కష్టం శ్రమ ఉందన్నారు.  ప్రతి కార్యకర్తకు హృదయ పూర్వకంగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానని ఆయన అన్నారు.

రానున్న రోజుల్లో రాష్ట్ర అభివృద్ధి మరో వైపు ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తోందని చెప్పారు. కేసీఆర్ నాయకత్వం లో ఈ రాష్టం అభివృద్ధిలో ముందు కెళ్లడం సంతోషంగా ఉందన్నారు.  ఏ ఆకాంక్ష ల కోసం తెలంగాణ సాదించామో అదిశలో కేసీఆర్ నాయకత్వం లో ముందుకెళ్లి ఇంకా అభివృద్ధి సాధించాలన్నారు. 

"

click me!