
తెలంగాణ ఐటి శాఖ మంత్రికి అవార్డుల పంట పండుతోంది. మంత్రివర్గంలో ఆయనకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు దక్కుతున్నాయి. తెలంగాణ ఐటి శాఖ మంత్రిగా దేశంలోనే ఆయన చేసిన సేవలకు గాను స్కోచ్ అనే సంస్థ ఈ ఏడాది మేటి ఐటి మంత్రి అవార్డును కేటిఆర్ కు ఇస్తామని ప్రకటించింది.
ఈ అవార్డును ఈనెల 9వ తేదీన ఢిల్లీలో జరిగే స్కోచ్ సదస్సులో అందజేయనున్నట్లు స్కోచ్ సంస్థ ఛైర్మన్ సమీర్ కొచ్చర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంత్రి కేటిఆర్ కు లేఖ ద్వారా సమాచారం పంపారు.
స్కోచ్ అనే సంస్థ 2003 నుంచి రాష్ట్రాల వారీగా పరిపాలనా అంశాలపై అధ్యయనం చేస్తోందని కొచ్చర్ తెలిపారు. ఉత్తమ సేవలు అందించిన వారిని గుర్తించి అవార్డులు ఇస్తున్నట్లు తెలిపాు. కేటిఆర్ ఐటి మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంలో చేసిన సేవలు అద్భుతమైని, తెలంగాణలో ఐటి అభివృద్ధికి, భవిష్యత్తులో ఐటి విస్తరణకు కేటిఆర్ బాటలు వేశారని కొచ్చర్ వివరించారు.
దీనిపై స్పందించిన కేటిఆర్ ఈ పురస్కారం సిఎం కేసిఆర్ దార్శనికతతో చేపట్టిన చర్యలకు ఇది ఒక గుర్తింపు అని తెలిపారు. ఈ పురస్కారం కేవలం తనకే కాక ఐటి శాఖ అధికారులు, సిబ్ందికి దక్కినట్లుగా భావిస్తున్నట్లు చెప్పారు.