కేసీఆర్ మంత్రి విస్తరణ తేదీ ఇదే: హరీష్ రావుకు నో చాన్స్?

By pratap reddyFirst Published Jan 6, 2019, 8:32 AM IST
Highlights

ఈసారి కూడా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడదనే సంకేతాలు అందుతున్నాయి. ఆరు లేదా ఏడుగురిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. దాంతో హరీష్ రావుకు విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది.

హైదరాబాద్‌: కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంత్రివర్గ విస్తరణకు కూడా తేదీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఈ నెల 18వ తేదీన జరుగుతోంది. అదే రోజు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అంటున్నారు. 

అయితే, ఈసారి కూడా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడదనే సంకేతాలు అందుతున్నాయి. ఆరు లేదా ఏడుగురిని కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకుంటారని అంటున్నారు. దాంతో హరీష్ రావుకు విస్తరణలో మంత్రి పదవి దక్కకపోవచ్చుననే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన కేటీ రామారావుకు కూడా స్థానం ఉండదని అంటున్నారు. 

ఈ నెల 18వ తేదీన మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోతే నెలాఖరులోనే ఉంటుందని అంటున్నారు. మరో16 మందికి మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అయితే, విస్తరణలో మరో ఆరుగురు లేదా ఏడుగురిని తీసుకోవచ్చునని అంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి విస్తరణ ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. 

click me!